సర్.. ఓ లక్ష ఓట్లు తొలగొచ్చు
Actor ProfilePolitician

సర్.. ఓ లక్ష ఓట్లు తొలగొచ్చు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సర్.. ఓ లక్ష ఓట్లు తొలగొచ్చు
Andhra Jyothy26 Oct 2026
సర్.. ఓ లక్ష ఓట్లు తొలగొచ్చు

చిత్తూరు నియోజకవర్గంలో అధికం ఇంకా డిజిటలైజేషన్‌ చేయాల్సిన ఫారాలు 2.10 లక్షలు మిగిలిందిక నాలుగు రోజులే బీఎల్వోలే కాదు.. ఓటర్లూ బాధ్యత వహించాల్సిందే జిల్లాలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా పెద్దఎత్తున ఓట్లు తొలగిపోనున్నాయి. జిల్లాలో మొత్తం 13.40 లక్షల ఓట్లు ఉండగా, సుమారు లక్ష ఓట్ల వరకు (7.5 శాతం) తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని అధికారులు కూడా ధ్రువీకరించారు. దీంతో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు స్పందించి ‘సర్‌’ ప్రక్రియలో భాగస్వామ్యం కాకుంటే తీవ్ర నష్టం జరిగే ప్రమాదముంది. ఈ ప్రక్రియకు మిగిలిందిక నాలుగు రోజులే. దీనికి అనుగుణంగా ఆయా పార్టీల నాయకులు సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. - చిత్తూరు, ఆంధ్రజ్యోతి చిత్తూరు జిల్లాలో మొత్తం 13,40,126 మంది ఓటర్లు ఉండగా, శుక్రవారం రాత్రి నాటికి 13,39,847 ఎన్యుమరేషన్‌ ఫారాలను పంపిణీ (99.98శాతం) చేశారు. పంపిణీ చేసినవాటిలో 10,87,403 (81.14శాతం) ఫారాలను డిజిటలైజేషన్‌ చేశారు. ఇంకా 210,915 ఫారాల్ని ఈ నాలుగు రోజుల్లో డిజిటలైజేషన్‌ చేయాల్సి ఉంది. కాగా, సర్‌ ప్రక్రియలో భాగంగా జిల్లాలోని మొత్తం ఓట్లలో లక్ష ఓట్లు తొలగిపోనున్నాయి. ఈ విషయాన్ని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ప్రకటించారు. మరణించినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, రెండుచోట్ల ఓటు ఉన్నవారు, బీఎల్వోలు వచ్చినప్పుడు ఇంటి వద్ద ఆబ్సెంట్‌ అయినవారు.. ఇలా వివిధ కేటగిరీల్లో ఓట్ల తొలగింపు జరగనుంది. అన్ని కేటగిరీల్లో ఇప్పటివరకు 41808 ఓట్లను తొలగించగా, ఈ నాలుగు రోజుల్లో ఆ సంఖ్య సుమారు లక్షకు చేరుతుందని కలెక్టరే స్వయంగా చెప్పారు. చిత్తూరులో అత్యధికంగా 10215 ఓట్లు ప్రస్తుతానికి తొలగించగా, నాలుగు రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు కానుంది. పలమనేరులో 8021, నగరిలో 7532, పూతలపట్టు 6998, కుప్పం 4626, జీడీనెల్లూరు 4416 ఓట్లను ప్రస్తుతానికి తొలగించగా.. ప్రక్రియ ముగిసేనాటికి ఈ సంఖ్య ఇంకా పెరగనుంది. ఓటరు జాబితాలో పేరు లేకుంటే..? 14వ తేదీన సర్‌

సర ఓ లక ష ఓట ల త లగ చ చ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in