
మాటల యుద్ధాన్ని రక్తికట్టించిన పాలక- విపక్ష నేతలు డీకే శివకుమార్- ఆర్.అశోక్ ఈనాడు, బెంగళూరు : ప్రణాళిక శాఖ మంత్రి నాగేంద్ర రాజీనామాపై ఏమాత్రం పట్టుసడలించని విపక్షాల తీరుతో మంగళవారం విలువైన సభా సమయం హరించుకుపోయింది. ప్రశ్నోత్తరాలు, బిల్లులు, కరవు వంటి సమస్యలపై చర్చలతో సజావుగా సాగాల్సిన సభ విపక్షాల నిరసన ధ్వనులతో దద్దరిల్లింది. మంత్రి రాజీనామా తర్వాతనే చర్చలకు సిద్ధమవుతామని చెబుతున్న విపక్షం రెండో రోజు కూడా తమ పట్టు కొనసాగించారు. కొత్త సభాపతి మంకాళ వైద్యపై అభినందన తీర్మానం వరకు కాస్త ఓపిక పట్టిన భాజపా, జేడీఎస్ సభ్యులు ఆ తర్వాత తమ ‘వరస’ మొదలు పెట్టారు. వీరి ఆందోళన నడుమ మూడు సార్లు వాయిదా పడిన సభ.. ఒకట్రెండు బిల్లులు, ఓ తీర్మానంతో సరిపెట్టుకుంది. కొత్త స్పీకర్ జీఎస్ పాటిల్‌కు నాలుగో రోజు కూడా సభను సజావుగా నడిపించే అవకాశం దొరకలేదు. ఈనాడు, బెంగళూరు : మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు చేసిన ముఖ్యమంత్రి తన వద్ద ఉన్న శాసనసభ వ్యవహారాలను మంత్రి కృష్ణభైరేగౌడకు బదిలీ చేశారు. సాధారణంగా శాసనసభ వ్యవహారాలు చూసుకునే మంత్రే న్యాయశాఖను పర్యవేక్షిస్తుంటారు. న్యాయశాఖను తన వద్దే అట్టిపెట్టుకున్న ముఖ్యమంత్రి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. మారిన శాఖల ప్రకారం ముఖ్యమంత్రి ఆర్థిక, న్యాయ, మానవహక్కులు, క్యాబినెట్ వ్యవహారాలు, వ్యక్తిగత, పాలన సంస్కరణలు, సమాచారం, వ్యవసాయ మార్కెటింగ్, ఇంటెలిజెన్స్ తదితరాలను పర్యవేక్షిస్తారు. ఇక బీడీఏ, బీఎంఆర్‌డీఏలు మినహాయించి బెంగళూరు నగరాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కృష్ణభైరేగౌడకు కొత్తగా శాసనసభ వ్యవహారాల శాఖ కట్టబెట్టారు. మినహాయించిన బీడీఏ, బీఎంఆర్‌డీఏలు ముఖ్యమంత్రి పరిధిలో ఉంటాయి. ఈనాడు, బెంగళూరు : ఉపసభాపతి అభినందన తీర్మానం వేళ ఆసక్తికరమైన ప్రస్తావనలతో సభ సాగింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కాసేపు మంకాళ వైద్య గురించి ప్రస్తావించినా అనంతరం తన వ్యక్తిగత ప్రయాణం, జీవిత అనుభవాలపై ఎక్కువగా మాట్లాడారు. ఈ సందర్భంగా బెంగళూరు ప్రగతి, రాజకీయాల్లో