సన్న వడ్ల బోనస్
Actor ProfilePolitician

సన్న వడ్ల బోనస్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సన్న వడ్ల బోనస్ పై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు.. ఆ ఏడు రకాలకే రూ.500 బోనస్
Samayam Telugu20 Sept 2026
సన్న వడ్ల బోనస్ పై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు.. ఆ ఏడు రకాలకే రూ.500 బోనస్

తెలంగాణలో సన్న వరి సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక బోనస్ పంపిణీ ప్రక్రియలో పూర్తిస్థాయి పారదర్శకతను తీసుకురావడానికి వ్యవసాయ శాఖ సరికొత్త నిబంధనలను, మార్గదర్శకాలను జారీ చేసింది. 2026 వానాకాలం సీజన్‌లో సాగు చేసే నిర్దేశిత ఏడు రకాల సన్న వరి పంటలకే ఈ బోనస్ దక్కనుంది. బోనస్ నిధులు దుర్వినియోగం కాకుండా, దళారులు, అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండటానికి విత్తనం కొనుగోలు దశ నుంచే ఆన్‌లైన్ నిఘాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు విత్తన డీలర్లు, క్షేత్రస్థాయి రైతులు తప్పనిసరిగా అనుసరించాల్సిన డిజిటల్ నమోదు ప్రక్రియను అధికారులు శనివారం రాత్రి అధికారికంగా ప్రకటించారు.రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన విత్తన డీలర్లు రైతులకు సన్న వరి విత్తనాలు విక్రయించిన వెంటనే ఆ సమాచారాన్ని ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అనే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. డీలర్లు సులభంగా లాగిన్ కావడానికి వీలుగా క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని కూడా కల్పించారు. డీలర్లు ఈ సైట్‌లో సన్న వరి రకాల అమ్మకాల ఆప్షన్‌ను ఎంచుకుని.. కొనుగోలు చేసిన రైతు పేరు, వారి తండ్రి పేరు, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ వంటి ప్రాథమిక వివరాలతో పాటు విత్తన రకం, కంపెనీ పేరు, లాట్ నంబర్, సీడ్ ప్యాకెట్ సైజ్, కొనుగోలు చేసిన తేదీని ఖచ్చితంగా నమోదు చేయాలి. ఈ డిజిటల్ నమోదు ప్రక్రియ కేవలం 2026 వానాకాలం సీజన్‌లో విక్రయించే విత్తనాలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం విధించిన గడువు లోపలే డీలర్లు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని వ్యవసాయ కమీషనరేట్ స్పష్టం చేసింది.ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. కేవలం ఏడు రకాల సన్న వరి విత్తనాలకు మాత్రమే బోనస్ రాయితీ లభిస్తుంది. ఆ జాబితాలో ఆర్‌ఎన్‌ఆర్–15048, బీపీటీ–5204, కేఎన్‌ఎం–1638, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, డబ్ల్యుజీఎల్–44, కేఎన్‌ఎం–7715 రకాలు మాత్రమే ఉన్నాయి. ఈ రకాలను సాగు చేస్తూ