షనక సంచలనం.. చరిత్రలో తొలి డబుల్ హ్యాట్రిక్
Actor ProfileActor

షనక సంచలనం.. చరిత్రలో తొలి డబుల్ హ్యాట్రిక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
షనక సంచలనం.. చరిత్రలో తొలి డబుల్ హ్యాట్రిక్
Sakshi25 Sept 2026
షనక సంచలనం.. చరిత్రలో తొలి డబుల్ హ్యాట్రిక్

శ్రీలంక ఆల్‌రౌండర్ దసున్ షనకా మేజర్ లీగ్ క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. జూలై 6న టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి టోర్నీ చరిత్రలో తొలి డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు. మ్యాచ్‌ చివరి ఓవర్లో అద్భుత బౌలింగ్‌తో ఫలితాన్ని తారుమారు చేసిన షనక, తన జట్టు సియాటిల్ ఆర్కాస్‌కు 9 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్కాస్ నెమ్మదైన పిచ్‌పై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. కెమరూన్ గానన్ 21 బంతుల్లో 20 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివరి ఓవర్‌లో మ్యాచ్ మలుపు 122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టెక్సాస్ సూపర్ కింగ్స్ కూడా నెమ్మదైన పిచ్‌పై పరుగులు చేయడానికి కష్టపడింది. అయినప్పటికీ చివరి ఓవర్లో విజయానికి కేవలం 15 పరుగుల దూరంలో మాత్రమే ఉండింది. చేతిలో ఐదు వికెట్లు ఉండటంతో టెక్సాస్ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే చివరి ఓవర్ బౌలింగ్ బాధ్యతను తీసుకున్న షనక మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మొదటి రెండు బంతులకు ఐదు పరుగులు రావడంతో టెక్సాస్‌కు నాలుగు బంతుల్లో కేవలం 10 పరుగులే కావాల్సి వచ్చింది. అక్కడి నుంచే షనక మాయ మొదలైంది. వరుసగా నాలుగు బంతుల్లో డొనొవన్‌ ఫెరియెరా, కాల్విన్‌ సావేజ్‌, ఆడమ్‌ మిల్నే, అమ్షి డిసిల్వను ఔట్‌ చేసి, డబుల్‌ హ్యాట్రిక్‌తో మ్యాచ్‌ను ముగించాడు. సూపర్‌ ఫామ్‌లో షనక ఈ సీజన్ ప్రారంభానికి ముందు షనక నుంచి ఇలాంటి ప్రదర్శనను ఎవరూ ఊహించలేదు. కానీ బంతితో పాటు బ్యాట్‌తోనూ అతడు ఆర్కాస్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌ల్లో 11 వికెట్లతో పాటు బ్యాటింగ్‌లో ఏడు ఇన్నింగ్స్‌ల్లో 196.05 స్ట్రయిక్‌రేట్‌తో 149 పరుగులు చేశాడు. షనక ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సియాటిల్ ఆర్కాస్

షనక స చలన చర త రల త ల డబ ల హ య ట ర క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in