శంషాబాద్ సత్తంరాయ్ వద్ద ఘోర ప్రమాదం.. బస్ స్టాప్ లోకి దూసుకెళ్లిన బొలెరో
Actor ProfilePolitician

శంషాబాద్ సత్తంరాయ్ వద్ద ఘోర ప్రమాదం.. బస్ స్టాప్ లోకి దూసుకెళ్లిన బొలెరో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
శంషాబాద్ సత్తంరాయ్ వద్ద ఘోర ప్రమాదం.. బస్ స్టాప్ లోకి దూసుకెళ్లిన బొలెరో, ముగ్గురు మహిళలు మృతి
Zee Telugu14 Oct 2026
శంషాబాద్ సత్తంరాయ్ వద్ద ఘోర ప్రమాదం.. బస్ స్టాప్ లోకి దూసుకెళ్లిన బొలెరో, ముగ్గురు మహిళలు మృతి

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Shamshabad Road Accident: రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వాహనాలు వేగంగా నడపడమే కాకుండా, రోడ్డు దాటడానికి వేచి చూస్తున్న వారిపైకి కూడా వాహనాలు దూసుకెళ్లడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లోనే కాకుండా, ఉదయం కూడా బ్రేక్ ఫెయిల్ అవ్వడం, నిద్రమత్తు లేదా అతివేగం వంటి కారణాల వల్ల ఇతరుల ప్రాణాలు పోతున్నాయి. ఈరోజు ఉదయం శంషాబాద్ సత్తంరాయిలో జరిగిన ప్రమాదంలో, బస్ స్టాప్‌లో బస్సు కోసం వేచి ఉన్న ముగ్గురు మహిళలపై మిర్చి లోడ్ తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి దూసుకెళ్లింది. దీంతో వారు వాహనం కింద నలిగి ప్రాణాలు కోల్పోయారు. పక్కన ఉన్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో బొలెరో స్కిడ్‌ అవ్వడం వల్ల ఈ విషాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి గురైన మహిళలు అక్కడి గ్రామస్తులేనని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సత్తంరాయి వద్ద గురువారం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం స్థానికులను కూడా కలచివేసింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రక్రియను చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేపట్టారు. అలాగే అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా క్లియర్ చేశారు. అయితే, స్థానికుల ప్రకారం ఆ ముగ్గురు మహిళలు తమ పనులన్నీ ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. శంషాబాద్ ప్రాంతంలో ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని, దీనివల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని, కావున అధికారులు తగిన చర్యలు

శ ష బ ద సత త ర య వద ద ఘ ర ప రమ ద బస స ట ప ల క ద స క ళ ల న బ ల ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in