హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతికి, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన రేడియల్ రోడ్-2 నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు శంషాబాద్-షాద్‌నగర్ డివిజన్లలో భూసేకరణ ప్రక్రియను చేపట్టాలని రెవెన్యూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. షాద్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ముట్‌పూర్, చుక్కమెట్, లాలాపేట్, ఉమ్మెత్యాల్, తుమ్మపల్లి గ్రామాల్లో ఈ రహదారి కోసం అవసరమైన భూములను రాబోయే పది రోజుల్లోనే పూర్తిస్థాయిలో సేకరించడానికి కసరత్తు ప్రారంభించారు.భూసేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా వారిలో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, షాద్‌నగర్ శాసనసభ్యుడు వీర్లపల్లి శంకర్ చర్యలు తీసుకున్నారు. రైతుల తరపున ప్రతినిధులతో ఉన్నత స్థాయి సంప్రదింపులు, ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టం ఆర్ఆర్ యాక్ట్-2013 నిబంధనల ప్రకారం పారదర్శకమైన పద్ధతిలో మార్కెట్ ధరకు అనుగుణంగా తగిన పరిహారాన్ని అందజేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ సానుకూల చర్చల అనంతరం భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన రైతుల నుంచి అధికారులు అధికారిక అంగీకార పత్రాలను సేకరించారు.రేడియల్ రోడ్-2 ప్రాజెక్టును రాజధాని శివార్లలోని బుద్వేల్ నుంచి ప్రారంభించి షాబాద్, కొండూర్, పరిగి మీదుగా ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కొడంగల్ వరకూ మొత్తం 81 కిలోమీటర్ల మేర అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే శంషాబాద్, షాబాద్ మండలాలలో ప్రతిపాదించిన పారిశ్రామిక కారిడార్లకు, కొత్తగా రాబోతున్న ఐటీ పరిశ్రమలకు అంతర్జాతీయ స్థాయి రవాణా సౌకర్యం లభించనుంది. ముఖ్యంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో టెర్మినల్ నుంచి నేరుగా షాబాద్, కొడంగల్ ప్రాంతాలల్లోని భారీ పరిశ్రమలకు అవసరమైన భారీ యంత్రాలు, ముడిపదార్థాలు, విదేశీ పరికరాలను వేగంగా, సులభంగా తరలించడానికి ఈ మార్గం అనుకూలంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. రేడియల్ రోడ్-2 నిర్మాణం పూర్తికావడం ద్వారా శంషాబాద్-షాద్‌నగర్ ప్రాంతాల మధ్య సరికొత్త పారిశ్రామిక జోన్లు ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయని
Actor ProfilePolitician
శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కొడంగల్ వరకు.. రేడియల్ రోడ్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•2 Oct 2026
శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కొడంగల్ వరకు.. రేడియల్ రోడ్-2 కోసం భూసేకరణ