శివ కార్తికేయన్ నిర్మాతలకు కోర్టులో చుక్కెదురు
Actor ProfileActor

శివ కార్తికేయన్ నిర్మాతలకు కోర్టులో చుక్కెదురు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
శివ కార్తికేయన్ నిర్మాతలకు కోర్టులో చుక్కెదురు
Chitrajyothy3 Jan 2027
శివ కార్తికేయన్ నిర్మాతలకు కోర్టులో చుక్కెదురు

ప్రముఖ దర్శకురాలు సుధ కొంగరకు మద్రాస్ హైకోర్టు నుంచి అనుకూల తీర్పు వచ్చింది. పరాశక్తి నిర్మాతలు ఆమెకు బాకీ ఉన్న రూ. 8.39 కోట్లను నాలుగువారాల్లో చెల్లించాలని స్పష్టం చేసింది. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగరకు న్యాయం జరిగింది. శివ కార్తికేయన్ హీరోగా ఆమె రూపొందించిన 'పరాశక్తి' చిత్రం నిర్మాతలకు కోర్టులో చుక్కెదురైంది. శివకార్తికేయన్ శ్రీలీల జంటగా సుధా కొంగర 'పరాశక్తి' చిత్రాన్ని రూపొందించారు. ఇది ఈ యేడాది పొంగల్ కానుకగా విడుదలైంది. అయితే సినిమా పరాజయం పాలైంది. దాంతో చిత్ర నిర్మాణ సంస్థ డాన్ పిక్చర్స్ సుధా కొంగరకు ఇవ్వాల్సిన రూ. 8.39 కోట్ల పారితోషికాన్ని ఎగ్గొట్టింది. దీంతో ఆమె న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టు వీలైనంత వరకూ ఈ వ్యవహారాన్ని మధ్యవర్తుల ద్వారా తేల్చుకోమని కోరింది. అందుకోసం ఇద్దరు వ్యక్తులను నియమించింది. కానీ వీరిద్దరూ రకరకాల కారణాలతో ఈ కేసు నుంచి తప్పుకున్నారు. దాంతో తాజాగా కోర్టు సుధా కొంగరకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. డాన్ పిక్చర్స్ సంస్థ నాలుగు వారాల్లో సుధా కొంగరకు ఇవ్వాల్సిన రూ. 8.39 కోట్లను ఇవ్వాలని స్పష్టం చేసింది. ఒకవేళ అలా జరగకపోతే, ఈ నిర్మాణ సంస్థ రాబోయే రోజుల్లో నిర్మించే సినిమాల ద్వారా వచ్చే లాభాల నుంచి ముందు సుధా కొంగర బాకీ తీర్చాల్సిందిగా ఆర్డర్ వేసింది. మొత్తం మీద కోర్టు ఇచ్చిన సానుకూల తీర్పుతో సుధా కొంగర ఊపిరి పీల్చుకున్నట్టైంది. రైలులో హీరోయిన్ హల్చల్.. బట్టలు విప్పేసి బ్లేడుతో దాడి బండ్ల గణేష్ కూతురు పెళ్లి.. అక్కినేని కోడలే హైలైట్ రష్మిక షో ఆఫ్ కామెంట్స్‌పై యశ్ రియాక్షన్.. అసలు నిజం ఇదిగో