శివలింగం ఎదురుగా దీపంతో సిగరెట్ వెలిగించిన యువకుడు.. వీడియో
Actor ProfilePolitician

శివలింగం ఎదురుగా దీపంతో సిగరెట్ వెలిగించిన యువకుడు.. వీడియో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
శివలింగం ఎదురుగా దీపంతో సిగరెట్ వెలిగించిన యువకుడు.. వీడియో
Zee Telugu27 Oct 2026
శివలింగం ఎదురుగా దీపంతో సిగరెట్ వెలిగించిన యువకుడు.. వీడియో

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Youth Lights Cigarette From Diya Video Watch: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కొందరు వ్యూస్ కోసం.. రీల్స్ కోసం ఎంతటి నీచానికైనా ఒడిగడుతున్నారు. తాజాగా సమాజం తలదించుకునేలా.. భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతినేలా ఒక ఘోర అపచారం చోటుచేసుకుంది. ఒక పవిత్ర శివాలయంలో యువకుడు చేసిన వికృత చేష్టకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.. దీనికి సంబంధించిన వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక యువకుడు శివాలయంలోని గర్భగుడి లేదా ప్రాంగణంలో ఉన్న శివలింగం ముందుకు వెళ్లాడు. అక్కడ స్వామివారికి భక్తితో వెలిగించిన దీపాన్ని చూసి కనీస భయం, భక్తి లేకుండా ప్రవర్తించడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు. ఆ దీపం కాంతితో తన నోట్లోని సిగరేట్‌ను వెలిగించాడు. అంతటితో ఆగకుండా.. దైవసన్నిధి అని కూడా చూడకుండా అక్కడే నిలబడి పొగ పీలుస్తూ తీవ్ర అహంకారాన్ని ప్రదర్శించడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు.. మండిపడుతున్న నెటిజన్లు.. ఈ వీడియో సోషల్ మీడియా వేదికలైన ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ అయిన కొన్ని గంటల్లోనే లక్షలాది మంది వీక్షించారు. వీడియో చూసిన హిందూ బంధువులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక తప్పు కాదని.. ముమ్మాటికీ సనాతన ధర్మాన్ని, దేవుడిని అవమానించడమేనని.. ఇలాంటి వారిని వదిలిపెడితే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఒక నెటిజన్ మండిపడ్డారు. మరికొందరు స్పందిస్తూ.. రీల్స్ పిచ్చితో యువత