శివకార్తికేయన్.. సేయోన్’ రెండో షెడ్యూల్ ప్రారంభం
Actor ProfileActor

శివకార్తికేయన్.. సేయోన్’ రెండో షెడ్యూల్ ప్రారంభం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
శివకార్తికేయన్.. సేయోన్’ రెండో షెడ్యూల్ ప్రారంభం
Chitrajyothy8 Dec 2026
శివకార్తికేయన్.. సేయోన్’ రెండో షెడ్యూల్ ప్రారంభం

శివకార్తికేయన్ హీరోగా శివకుమార్ మురుగేశన్ తెరకెక్కిస్తున్న ‘సేయోన్’ రెండో షెడ్యూల్ మదురైలో ప్రారంభమైంది. శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా తెరకెక్కుతున్న ‘సేయోన్’ (Seyon )సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ మదురైలో ప్రారంభమైంది. సినిమాలోని పలు కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. ఇందుకోసం భారీ ఖర్చుతో ప్రత్యేక సెట్‌ను నిర్మించి షూటింగ్ నిర్వహిస్తున్నారు. ‘తాయ్ కిళవి’ (Thaai Kizhavi) వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శివకుమార్ మురుగేశన్ (Sivakumar Murugesan) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. నటుడు కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శివకార్తికేయన్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. అరుల్స్, రేచల్ రెబాకా, సింగంపులి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర పోషించనుండటం ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శివకార్తికేయన్, సీమాన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది