
Eenadu•27 Sept 2026
శ్రీవారిని దర్శించుకున్న లెనిన్ చిత్రబృందంసినీనటుడు అక్కినేని నాగార్జున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి అమల, లెనిన్ చిత్రబృందంతో ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. కుమారుడు అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం లెనిన్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలలో భాగంగా ఆయన తిరుపతికి వచ్చారు. తితిదే అధికారులు నాగార్జున, చిత్రబృందానికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ వార్త చదివారా: 116 ఏళ్ల వృద్ధురాలికి.. శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం