హిందూ పురాణాల ప్రకారం, అష్టలక్ష్ముల్లో ఆదిలక్ష్మికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ‘ఆది’ అంటే మొట్టమొదటిది అని అర్థం. మనం ఏదైనా సాధించాలంటే ముందుగా ఒక ఆలోచన, కచ్చితమైన లక్ష్యం, దాన్ని నెరవేర్చుకోవాలనే సంకల్పం కచ్చితంగా అవసరం పడుతుంది. అందుకే ఆదిలక్ష్మిని సంకల్పశక్తి, అంతరంగ బలం, ధార్మిక చైతన్యానికి ప్రతీకగా భావించొచ్చు. మనలో కొందరికి ధైర్యం పుష్కలంగా ఉంటుంది. అయితే జ్ఞానం లేకపోతే సక్సెస్ సాధించడం కష్టం. ఏ పనిలో అయినా విజయం సాధించాలంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అందుకు తెలివితేటలు, విద్య, జ్ఞానం, నైపుణ్యాలు చాలా అవసరం. వీటన్నింటికీ విద్యాలక్ష్మిని సంకేతంగా భావిస్తారు. అందుకే విద్యను అత్యంత విలువైన సంపదగా పరిగణిస్తారు. మనలో ప్రతి ఒక్కరికీ జీవితంలో కష్టాలు, సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అయితే వాటిని చూసి భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొనేందుకు శక్తి, సామర్థ్యాలు కావాలి. అందుకే ధైర్యలక్ష్మిని సాహసం, సహనం, ఆత్మవిశ్వాసానికి సంకేతంగా పరిగణిస్తారు. క్లిష్టమైన పరిస్థితుల్లో మనోధైర్యంగా ఉండేందుకు, అమ్మవారి అనుగ్రహం ముఖ్యమని పండితులు చెబుతారు. మనలో ప్రతి ఒక్కరికి ధైర్యం, విద్య, శక్తి, సామర్థ్యాలు ఎన్ని ఉన్నా గెలుపు సాధిస్తేనే అన్నింటికి ప్రయోజనం చేకూరుతుంది. అలాంటి శక్తిని అందించే దేవత విజయలక్ష్మి. గెలుపు అంటే కేవలం పరీక్షల్లో పాస్ అవ్వడం, మంచి ఉద్యోగం సంపాదించడం, వ్యాపారులు మంచి లాభాలు పొందడమే కాదు, మంచి ఆలోచనలతో జీవించడం, ధర్మబద్ధంగా లక్ష్యాలను చేరుకోవడమే నిజమైన గెలుపుకు అర్థం. మనలో ప్రతి ఒక్కరి జీవిత మనుగడ కోసం ఆహారం అత్యంత ముఖ్యమైనది. ఎంత డబ్బు ఉన్నా ఆహారం లేకుండా జీవితం సాఫీగా సాగదు. అందుకే ధాన్యలక్ష్మిని ఆహారం, వ్యవసాయానికి సంకేతంగా భావిస్తారు. ఇంట్లో ఉండే ఆహారాన్ని అన్నపూర్ణ దేవతగా భావించి పూజిస్తారు. అందుకే ఆకలితో ఉండే వారికి అన్నం పెట్టడం వల్ల ధాన్యలక్ష్మిని ఆశీస్సులు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. హిందూ సంప్రదాయం ప్రకారం, ధనలక్ష్మి అంటే డబ్బు, బంగారానికి
Actor ProfileCelebrity
శ్రావణ శుక్రవారం వేళ వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తే
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•14 Jan 2027
శ్రావణ శుక్రవారం వేళ వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తే, అష్టలక్ష్ముల ఆశీస్సులు లభిస్తాయా