ఈ ఏడాది శ్రావణ శుక్రవారం వేళ పేదరికంలో ఉండే వివాహిత మహిళలకు, కొత్తగా పెళ్లి చేసుకున్న స్త్రీలకు ఎర్రని రంగులో ఉండే గాజులు, సౌందర్య ఉత్పత్తులు, సింధూరం వంటి వాటిని దానం చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి, మీ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగించే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఆర్థిక పరమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంపదకు సంబంధించి ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం లభిస్తుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శ్రావణ శుక్రవారాన్ని లక్ష్మీదేవితో పాటు శుక్ర గ్రహానికి కూడా ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు. ఈ పవిత్రమైన రోజున చిన్నారులకు లేదా బాలికలకు తెల్లని రంగులో ఉన్న మిఠాయిలను దానం చేయాలి. ఇవి దానం చేయడం వల్ల శుక్ర గ్రహ దోష ప్రభావం తగ్గిపోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు మీ వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. వరలక్ష్మీ దేవి అనుగ్రహం కూడా లభించే అవకాశం ఉంటుంది. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజున ఇలాంటి వస్తువులను దానం చేయడం వల్ల మీ సంపద పెరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఈ పర్వదినాన చక్కెర, పెరుగు, ఉప్పు వంటి పదార్థాలను దానం చేయడం వల్ల ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు ఉండవట. అంతేకాదు మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. మీ కుటుంబ సంక్షేమం, శ్రేయస్సు పెరుగుతుంది. మీ బంధువులతో, తోబుట్టువులతో విభేదాలన్నీ తొలగిపోయి, మీ బంధం మరింత బలపడొచ్చు. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజున మీ సోదరీమణులకు లేదా ఇతర మహిళలకు లేదా ఆడపడుచులకు పట్టుచీరలు దానంగా ఇవ్వడం వల్ల మీ కుటుంబజీవితంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఇలా చేయడం వల్ల మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామితో బంధం మరింత బలపడొచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి. శ్రావణ శుక్రవారం వంటి పవిత్రమైన రోజున శ్రీ యంత్రాన్ని
Actor ProfileCelebrity
శ్రావణ శుక్రవారం వేళ ఏ వస్తువులు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•24 Dec 2026
శ్రావణ శుక్రవారం వేళ ఏ వస్తువులు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది