ఈ ఏడాది ఆగస్టు 17న తొలి శ్రావణ సోమవారం ప్రారంభం కానుంది. ఈ మాసంలో మొత్తం నాలుగు సోమవారాలు రానున్నాయి. ఈ సమయంలో శివయ్యను పూజించడానికి ఉత్తమ సమయంగా భావిస్తారు. ముఖ్యంగా శ్రావణ సోమవారం రోజున పరమేశ్వరుడిని పూజించడం వల్ల విశేష ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. మారేడు దళాలు, జలాభిషేకం చేయడం వల్ల గ్రహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని శివపురాణంలోపేర్కొనబడింది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ కాలంలో కొత్తగా పెళ్లైన జంటలు ఈ వ్రతాన్ని ఆచరించి ముత్తైదువులకు వాయనాలు ఇవ్వడం వల్ల శుభఫలితాలొస్తాయని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుందని నమ్ముతారు. ఈ మాసంలోని ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఐదేళ్ల పాటు చేయాలని పండితులు చెబుతున్నారు. ఈసారి శ్రావణ మాసంలో తొలి శుక్రవారం ఆగస్టు 14న వస్తుంది. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం పొందడానికి సమయం అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతారు. అంతేకాదు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరాలిచ్చే తల్లి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ పవిత్రమైన రోజున వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆదాయం, సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. అలాగే సంతాన సౌభాగ్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి కుదరని వారు మిగిలిన మూడు శుక్రవారాల్లో ఎప్పుడైనా ఆచరించొచ్చని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది మొత్తం 5 శ్రావణ శుక్రవారాలు రావడం కూడా విశేషం. శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే శుద్ధ పంచమ రోజున నాగ పంచమి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ ఏడాది శ్రావణ సోమవారం రోజున ఆగస్టు 17న నాగ పంచమిని జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం దీక్షను ఆచరించి, దేవాలయాల్లో ఉండే నాగ ప్రతిమలకు పాలాభిషేకం చేసి
Actor ProfileCelebrity
శ్రావణ మాసం ప్రత్యేకతలేంటి? నాగ పంచమి
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•15 Dec 2026
శ్రావణ మాసం ప్రత్యేకతలేంటి? నాగ పంచమి, వరలక్ష్మీ వ్రతం, జన్మాష్టమి విశిష్టతలివే