శ్రావణ భార్గవితో విడాకుల
Actor ProfileCelebrity

శ్రావణ భార్గవితో విడాకుల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
శ్రావణ భార్గవితో విడాకులపై తొలిసారి నోరు విప్పిన హేమచంద్ర
HMTV20 Jan 2027
శ్రావణ భార్గవితో విడాకులపై తొలిసారి నోరు విప్పిన హేమచంద్ర

Singer Hemachandra: శ్రావణ భార్గవితో విడాకులపై తొలిసారి నోరు విప్పిన హేమచంద్ర! Sravana Bhargavi: ప్రముఖ టాలీవుడ్ నేపథ్య గాయకుడు హేమచంద్ర తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా భార్య శ్రావణ భార్గవితో విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న వార్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా ఇంటర్వ్యూలో గత మూడేళ్లుగా తమపై చెలరేగుతున్న ఊహాగానాలపై స్పందిస్తూ, మీడియాలో జరుగుతున్న చర్చల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు క్లిక్‌బైట్, సంచలనాల కోసం దారుణమైన థంబ్‌నైల్స్ క్రియేట్ చేస్తున్నాయని హేమచంద్ర మండిపడ్డారు.ఆవేదన వ్యక్తం చేసిన సంఘటన: తన కుమార్తె తల్లిదండ్రులు తిరిగి కలవాలని వేడుకుంటున్నట్లు రూపొందించిన ఒక వీడియో థంబ్‌నైల్‌ను ప్రస్తావిస్తూ తీవ్రంగా స్పందించారు. మా ఇంట్లో ఎప్పుడూ జరగని విషయాన్ని మీరెలా చిత్రీకరిస్తారు? ఏం పిచ్చి దొబ్బిందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి క్రియేటివిటీ చూపించడాన్ని పక్కన పెడితే, కుటుంబ సభ్యులతో పంచుకోలేని, సమాజంలో సిగ్గుపడే పనులను ఎవరూ చేయకూడదని హెచ్చరించారు. ఎవరైనా కుట్రపూరితంగా ప్రచారాలు చేసినప్పుడు వాటికి అనవసరంగా బహిరంగ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత జీవితంలో ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పబ్లిక్ డొమైన్‌లో పెట్టి ప్రొలాంగ్ చేయకుండా, కొంత సమయం తీసుకుని ప్రైవేటుగా పరిష్కరించుకోవాలి.సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై చేసే ఇటువంటి చర్చలు, పబ్లిక్ స్పేస్‌లో లేని వారి కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా ఇంట్లోని పెద్దలు, పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన భావోద్వేగాలు, ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడానికి తన ‘ADHD’ ఆల్బమ్ వినాలని హేమచంద్ర సూచించారు.ఈ ఆల్బమ్‌లోని "యు ఆర్ మైన్" అనే పాట తన నిజమైన భావోద్వేగాల ప్రవాహమని చెప్పారు. కొంచెం తెలివైన వ్యక్తి అయితే ఆ ఆల్బమ్ వినగానే నా మనసులోని సమాధానం ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, తన భార్య శ్రావణ భార్గవి గురించి మాట్లాడుతూ.. ఆమె ఒక అద్భుతమైన

శ ర వణ భ ర గవ త వ డ క ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in