
Srinivasa Mangapuram Trailer : సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కొడుకు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. బాలీవుడ్ భామ రాషా తడాని కథానాయిక. అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్వినీ దత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్ పై జెమినీ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. తిరుపతి నేపథ్యంలో సాగే ప్రేమకథతో ఈ చిత్రం రూపొందింది. తన ప్రేమని సాధించుకునేందుకు ఎంతదాకైనా పోరాడే కుర్రాడిగా శ్రీను పాత్రలో జయకృష్ణ కనిపించిన తీరు, తను చేసిన యాక్షన్ హంగామా బాగుంది. ‘అవసరం అయితే నీ కోసం తిరుపతి మొత్తాన్ని ఎదిరిస్తా గానీ నిన్ను మాత్రం వదలను మంగ అని చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ‘మొత్తంగా ట్రైలర్ అదిరిపోయింది. Pranavi Manukonda : లెహంగాలో తెలుగు అందం.. ప్రణవి మానుకొండ ఫోటోలు వైరల్