
అశ్విని దత్ సమర్పణలో, పి. కిరణ్ చందమామ కథలు బ్యానర్ నిర్మాణంలో జై కృష్ణ ఘట్టమనేని, రాషా తడాని, అజయ్ భూపతి 'శ్రీనివాస మంగాపురం' లవ్, ఇంటెన్స్ ఎమోషన్స్, పవర్ ఫుల్ యాక్షన్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని 'శ్రీనివాస మంగాపురం' చిత్రంతో హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని ఈ చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తోంది. సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్నారు. పి. కిరణ్ నిర్మించి, అశ్విని దత్ సమర్పిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. ప్రతి అప్‌డేట్‌కు గొప్ప స్పందన లభిస్తోంది. తాజాగా నిర్మాతలు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. శ్రీనుకు మంగా అంటే ప్రాణం. మొదట అతని ప్రేమను అంగీకరించని మంగా, అతని నిజమైన ప్రేమను చూసి చివరకు ప్రేమలో పడుతుంది. ఇద్దరి ప్రేమ అందంగా సాగుతున్న సమయంలో బళ్లారి రాజు వెంకటప్పయ్య నాయుడు వారి జీవితాల్లోకి వస్తాడు. వారి ప్రేమకు అతడే అతిపెద్ద అడ్డంకిగా మారతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వారి ప్రేమ గెలిచిందా? అనేదే సినిమా కథ. ప్రేమ కథలను తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు అజయ్ భూపతి, ఈ చిత్రాన్ని ప్రేమ, యాక్షన్, బలమైన భావోద్వేగాలతో కూడిన రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా అద్భుతంగా రూపొందించారు. ట్రైలర్ సినిమా అసలు కాన్సెప్ట్‌ను ఆసక్తికరంగా పరిచయం చేస్తూ, కథపై మరింత ఆసక్తిని పెంచుతోంది. తొలి సినిమాతోనే జై కృష్ణ ఘట్టమనేని ఆదరగొట్టారు. స్క్రీన్‌పై చాలా సహజంగా కనిపించడమే కాకుండా, డైలాగ్ డెలివరీ, హావభావాలు, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. ప్రేమ సన్నివేశాల్లో చక్కటి హావభావాలు చూపించిన ఆయన, యాక్షన్ సన్నివేశాల్లో కూడా మంచి