
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ బహుజన చక్రవర్తిగా కీర్తి పొందిన చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి రూపొందించిన యానిమేషన్ మూవీ “సర్దార్ సర్వాయి పాపన్న”. ఈ సినిమాను వి.జి.మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. దీపక్ న్యాతి నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు వహిస్తున్నారు. ఈ యానిమేషన్ మూవీ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ చేతుల మీదుగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా సాంగ్ లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ – బడుగుల కోసం పోరాడి బహుజన చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నారు సర్దార్ సర్వాయి పాపన్న. ఆ కాలంలో రాజు తర్వాత ఆయన వారసులే రాజులు అయ్యేవారు. అలాంటి రాచరిక వ్యవస్థను ఎదిరించి ఒక సామాన్యుడు కూడా రాజు కావొచ్చని నిరూపించాడు సర్దార్ సర్వాయి పాపన్న. ఎన్నో కోటలు గెలిచి, చివరకు గోల్కొండ కోటను కూడా ఎదిరించాడు. మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్దార్ సర్వాయి పాపన్నకు తగిన గౌరవం ఇచ్చాం. ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద నెలకొల్పేందుకు స్థలం కేటాయించాం. ఆయన జయింతి వర్థంతిని ఘనంగా జరిపాం. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితోనే బడుగుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చాం. అలాంటి వీరుడిని చరిత్రను సినిమాగా రూపొందించిన వెంకటేష్ గౌడ్ ను అభినందిస్తున్నా. అలాగే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్న ప్రతాని రామకృష్ణ గౌడ్ గారిని అభినందిస్తున్నా. ఈ సినిమాను ప్రేక్షకులంతా చూసి విజయం అందించాలని కోరుకుంటున్నా అన్నారు. శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ


