శోభన్ బాబుకి బుద్ది చెప్పాలని ఏఎన్నార్ ను రంగంలోకి దింపిన కృష్ణ
Actor ProfileActor

శోభన్ బాబుకి బుద్ది చెప్పాలని ఏఎన్నార్ ను రంగంలోకి దింపిన కృష్ణ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
శోభన్ బాబుకి బుద్ది చెప్పాలని ఏఎన్నార్ ను రంగంలోకి దింపిన కృష్ణ , హేమా హేమీలు రివ్యూ
Asianet News Telugu19 Nov 2026
శోభన్ బాబుకి బుద్ది చెప్పాలని ఏఎన్నార్ ను రంగంలోకి దింపిన కృష్ణ , హేమా హేమీలు రివ్యూ

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలను ఆడియన్స్ ఎప్పుడూ ఆధరిస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్, ఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి అలనాటి తారల నుంచి నేటి రామ్ చరణ్, ఎన్టీఆర్ వరకు అద్భుతమైన మల్టీస్టారర్ మూవీస్ చేశారు. ఇద్దరు అగ్ర హీరోలు ఒకే తెరపై కనిపిస్తే అభిమానులకు పండగే. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (ANR), సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన మల్టీస్టారర్ చిత్రం ‘హేమా హేమీలు’ సినిమా కూడా ఈ కోవలోకే వస్తుంది. 1979లో విడుదలైన ఈ సినిమా కేవలం ఇద్దరు స్టార్ హీరోల కలయిక మాత్రమే కాదు, దీని వెనుక చాలా పెద్ద కథ ఉంది. ‘హేమా హేమీలు’ సినిమాను సూపర్ స్టార్ కృష్ణ నిర్మించగా.. ఆయన భార్య విజయనిర్మల డైరెక్ట్ చేసింది. ఈ సినిమాలో మెయిన్ హీరోగా అక్కినేని నాగేశ్వరావును తీసుకున్నారు కృష్ణ. తానుకూడా తోడై.. ఈసినిమాలో నటించారు. హిందీలో వచ్చిన డాన్ సినిమా కథను ప్రేరణగా తీసుకుని.. అందులో కృష్ణ, విజయ నిర్మల పాత్రలను చేర్చి.. మహారథితో కొత్త స్క్రిప్ట్ రాయించారు కృష్ణ. అయితే ఈ సినిమా నిర్మించడానికి పరోక్షంగా శోభన్ బాబు కారణం అయ్యాడు. ఆయన మీద కోపంతోనే కృష్ణ ఈసినిమాను నిర్మించారు. ఒకసారి వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న శోభన్ బాబు.. కృష్ణతో సినిమా చేయాలని కబురు పంపించారు. వెంటనే కృష్ణ స్వయంగా వెళ్లి శోభన్ బాబకు 25 వేలు అడ్వాన్స్ ఇచ్చి.. ఇద్దరం సినిమా చేస్తున్నాం.. విజయనిర్మల డైరెక్ట్ చేస్తుంది అని చెప్పివచ్చారు. ఈలోపు శోభన్ బాబుకు మల్లెపువ్వు సినిమాతో హిట్ పడింది. దాంతో కృష్ణతో సినిమా చేయనని చెప్పి.. ఆ 25 వేలు అడ్వాన్స్ ను తిరిగి పంపించారు. దాంతో కృష్ణకు కోపం వచ్చింది. వెంటనే అక్కినేని నాగేశ్వరరావు దగ్గరకు వెళ్లి .. మీతో సినిమా చేస్తాను అన్నారు. అప్పటికే వారి మధ్య దేవదాసు సినిమా గొడవలు నడుస్తున్నాయి

శ భన బ బ క బ ద ద చ ప ప లన ఏఎన న ర న ర గ ల క ద ప న క ష ణ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in