శుక్రాచార్య.. మహాకాళి’ నుంచి బిగ్ అప్ డేట్ కు డేట్ ఫిక్స్
Actor ProfilePolitician

శుక్రాచార్య.. మహాకాళి’ నుంచి బిగ్ అప్ డేట్ కు డేట్ ఫిక్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
శుక్రాచార్య.. మహాకాళి’ నుంచి బిగ్ అప్ డేట్ కు డేట్ ఫిక్స్
Chitrajyothy17 Jan 2027
శుక్రాచార్య.. మహాకాళి’ నుంచి బిగ్ అప్ డేట్ కు డేట్ ఫిక్స్

భారతీయ పురాణ ఇతిహాసాల స్ఫూర్తితో దేశీ సూపర్ హీరో కథలను తెరకెక్కిస్తోన్న ప్రశాంత్ వర్మ, తన యూనివర్స్ నుంచి రూపొందిస్తున్న భారీ చిత్రం ‘మహాకాళి’. ఈ మూవీ నుంచి ఓ సాలిడ్ అప్‌డేట్ రాబోతోంది. తేజ సజ్జా (Teja Sajja) హీరోగా తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanuman) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టించిన ప్రశాంత్ వర్మ.. తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU)ను విస్తరిస్తూ ముందుకు సాగుతోన్న విషయం తెలిసిందే. భారతీయ పురాణ ఇతిహాసాల స్ఫూర్తితో దేశీ సూపర్ హీరో కథలను తెరకెక్కిస్తోన్న ప్రశాంత్ వర్మ (Prasanth Varma), తన యూనివర్స్ నుంచి రూపొందిస్తున్న భారీ చిత్రం ‘మహాకాళి’ (Mahakali). భారతదేశపు మొట్టమొదటి ఫిమేల్ సూపర్ హీరో చిత్రంగా భారీ కాన్వాస్‌పై రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ నుంచి తాజాగా మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్ అందించారు. ఇటీవల ‘ధురంధర్’ చిత్రంలో తనదైన నటనతో ఆకట్టుకున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna).. ఈ సినిమాలో అత్యంత కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో అక్షయ్ ఖన్నా రాక్షసుల గురువైన ‘శుక్రాచార్య’ అనే శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించగా, పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలను పరిచయం చేస్తూ ఆగస్ట్ 24న చిత్ర బృందం ‘ఫస్ట్ గ్లింప్స్’ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ‘ఆగస్టు 24 - ది ఎండ్ బిగిన్స్’ అంటూ నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో విడుదల చేసిన ప్రకటన సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఒక పురాణ పాత్రలో అక్షయ్ ఖన్నా నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రంలో భూమి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, రోహిత్ సరాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ, మూల కాన్సెప్ట్ అందించగా, ప్రతిభావంతురాలైన పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్‌కే