శంకర్ డైరెక్షన్ లో అజిత్ సినిమా.. వర్కవుట్ అవుతుందా
Actor ProfileActor

శంకర్ డైరెక్షన్ లో అజిత్ సినిమా.. వర్కవుట్ అవుతుందా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
శంకర్ డైరెక్షన్ లో అజిత్ సినిమా.. వర్కవుట్ అవుతుందా
Chitrajyothy30 Nov 2026
శంకర్ డైరెక్షన్ లో అజిత్ సినిమా.. వర్కవుట్ అవుతుందా

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోల కాంబినేషన్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్‌పై కోలీవుడ్‌లో ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది. తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోల కాంబినేషన్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్‌పై కోలీవుడ్‌లో ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది. స్టార్ డైరెక్టర్ శంకర్, స్టార్ హీరో అజిత్ కుమార్ కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కాంబినేషన్ నిజమైతే.. కోలీవుడ్‌లో ఇది భారీ ప్రాజెక్ట్‌గా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శంకర్ (Shankar) సినిమా అంటే భారీతనం. ప్రస్తుతం ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వేల్పారి’(Velpari)పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావదానికి కాస్త ఆలస్యం అవుతోందని టాక్. దీంతో ఈ గ్యాప్‌లో ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలని శంకర్ భావిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే అజిత్ పేరు తెరపైకి వచ్చింది. శంకర్, అజిత్ (Ajitha) కాంబినేషన్‌లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఇద్దరూ తమ తమ రంగాల్లో ఎన్నో విజయాలు అందుకున్నప్పటికీ కలిసి పనిచేయకపోవడం అభిమానులకు ఎప్పటినుంచో ఆసక్తికరమైన విషయమే. ఇప్పుడు ఈ ఇద్దరూ చేతులు కలిపితే ఆ క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు అజిత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో ‘డేర్ డెవిల్’ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మంకథ 2’ చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక శంకర్–అజిత్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుందా? లేక ఇది కేవలం ప్రాథమిక చర్చలకే పరిమితమవుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది

శ కర డ ర క షన ల అజ త స న మ వర కవ ట అవ త ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in