
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Petrol and diesel prices: ఆగస్టు నుంచి ముడి చమురు ఉత్పత్తిని పెంచడానికి ఒపెక్+ దేశాలు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలను స్థిరీకరించడమే ఈ చర్య లక్ష్యమని చెప్పాలి. ప్రస్తుతం, బ్రెంట్ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 72 డాలర్లుగా ఉన్నాయి. చమురు ధరలలో ఈ తగ్గుదల భారత ఆర్థిక వ్యవస్థకు, అలాగే సాధారణ వినియోగదారులకు ఒక పెద్ద ఉపశమనంగా మారనుంది. భారతదేశం తన చమురు అవసరాలలో 80శాతం కంటే ఎక్కువ దిగుమతులపై ఆధారపడి ఉంది. అంతర్జాతీయ ధరలు తగ్గినట్లయితే.. అమెరికన్ డాలర్‌కు డిమాండ్ తగ్గుతుంది. ఇది ప్రపంచ కరెన్సీలతో పోలిస్తే భారత రూపాయి విలువను స్థిరీకరించడంలో సహాయపడుతుంది. రూపాయి బలపడితే దిగుమతి వస్తువుల ధరలు తగ్గి.. ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుంది. ఫలితంగా.. సాధారణ ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుంది. అయితే దేశంలో ఇంధన ధరలపై ఒపెక్+ నిర్ణయ ప్రభావాన్ని భారత్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ సంస్థలు పరిశీలిస్తున్నాయి. రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికే ధరలను కొద్దిగా తగ్గించాయి. అయితే.. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గత నష్టాలను పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అందుకే పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను తగ్గించాలని తీసుకునే నిర్ణయం కొంచెం ఆలస్యం అవకాశం ఉంది. ముడి చమురు ధరల తగ్గుదల ఏవియేషన్ ఫ్యూయల్ ధరలను కూడా తగ్గిస్తుంది. దీనివల్ల త్వరలో విమాన ఛార్జీల భారం తగ్గే అవకాశం ఉంది. అదనంగా పెయింట్, లాజిస్టిక్స్ కంపెనీలు మెరుగైన లాభాలను చూస్తాయి. ఎందుకంటే వాటి ముడి పదార్థాలు, రవాణా ఖర్చులు నేరుగా అంతర్జాతీయ చమురు ధరలతో ముడిపడి ఉంటాయి. రూపాయి విలువ, విమాన