
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Vastu Plants: మన దగ్గర ఏదైనా కిరాయి ఇల్లు చూడాలన్న అది వాస్తు ప్రకారం ఉందా లేదా అనేది ఒకటికి రెండు సార్లు తరచి చూసుకుంటారు. అలాగే వ్యాపారం చేయడానికైనా ఇతరత్రా ఏదైనా పనుల కోసం కూడా వాస్తు చూడాల్సిందే. ఇక మన సంస్కృతి సాంప్రదాయాల్లో వాస్తు శాస్త్రంలో కొన్ని మొక్కలకు ప్రాముఖ్యత ఉంది. అలాగే, ఇంట్లో కొన్ని మొక్కలను పెంచుకోవడం మంచిదని చాలా మంది జ్యోతిష్యులు చెబుతున్నమాట. ఇప్పుడు, పూజ గదిలో లేదా ఇంటి మూలలో పవిత్రమైనవిగా భావించే కొన్ని మొక్కలను పెంచుకోవడం వల్ల ఆ ప్రదేశంలో సానుకూల శక్తి విపరీతంగా పెరుగుతుందని ప్రముఖ వాస్తు నిపుణులు చెబుతున్న మాట. కాబట్టి, పూజ గది యొక్క పవిత్రతను పెంచి, మనశ్శాంతిని, లక్ష్మీదేవి ఆశీస్సులను కలిగించే 5 ముఖ్యమైన మొక్కల గురించిన పూర్తి సమాచారం ఇక్కడ ప్రస్తావించబడింది. హిందూ సంప్రదాయంలో, తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. పూజ గదిలో ఈశాన్య లేదా తూర్పు దిశలో ఒక చిన్న తులసి మొక్కను ఉంచడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతున్న మాట. మల్లె, పారిజాత పువ్వుల సువాసన దేవునికి చాలా ప్రియమైనది. పూజ గది చుట్టూ వీటిని ఉంచడం వల్ల వచ్చే సహజ సువాసనతో పాటు ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి, మనశ్శాంతిని పెంచుతుందట. పవిత్రమైన వెదురు మొక్క ఇంటికి శాంతిని, దీర్ఘాయువును తీసుకొస్తుందట. వాస్తు శాస్త్రం ప్రకారం, 5 లేదా 7 గుండ్రని