
సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో కథానాయకుడు సూర్య మాట్లాడుతూ.. “ఈ వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే నవీన్ గారికి, మా సినీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ధన్యవాదాలు. అలాగే, రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న నా అభిమానులు, వారి కుటుంబ సభ్యులకు నా నమస్కారం. 28 ఏళ్ళ నుంచి మీరు నాపై ఈ ప్రేమను చూపిస్తున్నారు. మీ వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను. నాగవంశీ గారు, వెంకీ వల్లే ఇలాంటి మంచి సినిమా సాధ్యమైంది. ఈ సినిమాను మీరు థియేటర్లలో చూసి ఖచ్చితంగా ప్రేమిస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమాకు ప్రారంభం నుంచి త్రివిక్రమ్ గారి ఆశీస్సులు ఉన్నాయి. ఆయన మాకు ఎప్పుడూ అండగా ఉన్నారు. త్రివిక్రమ్ గారు కుటుంబ విలువలతో కూడిన మంచి సినిమాలను, ఈ జనరేషన్ మెచ్చేలా అందించారు. త్రివిక్రమ్ గారిని వెంకీ స్ఫూర్తిగా తీసుకున్నారు. జీవీ ప్రకాష్ అద్భుతమైన సంగీతం అందించారు. వెంకీ, జీవీ కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ అవుతుంది. డీఓపీ నిమిష్, ఆర్ట్ డైరెక్టర్ బంగ్లాన్, ఎడిటర్ నవీన్ ఇలా ప్రతి ఒక్కరూ సినిమా అద్భుతంగా రావడానికి కారణమయ్యారు. ఈ సినిమా కోసం నేను హైదరాబాద్ లో ఉన్న ఆరు నెలలను అసలు మరచిపోలేను. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. 20 ఏళ్ల క్రితం గజినీ సినిమాలో నన్ను సంజయ్ రామస్వామిగా ఆదరించారు. అదే మ్యాజిక్ ని తీసుకురావాలని వెంకీ, వంశీ అనుకున్నారు. రాధిక గారి వల్ల