విశ్వనాథ్ సన్స్' బుకింగ్స్ లో జోరు.. సూర్య సినిమాకు 24 గంటల్లో 5 లక్షల టికెట్లు
Actor ProfileActor

విశ్వనాథ్ సన్స్' బుకింగ్స్ లో జోరు.. సూర్య సినిమాకు 24 గంటల్లో 5 లక్షల టికెట్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విశ్వనాథ్ సన్స్' బుకింగ్స్ లో జోరు.. సూర్య సినిమాకు 24 గంటల్లో 5 లక్షల టికెట్లు
AP7AM29 Dec 2026
విశ్వనాథ్ సన్స్' బుకింగ్స్ లో జోరు.. సూర్య సినిమాకు 24 గంటల్లో 5 లక్షల టికెట్లు

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం 'విశ్వనాథ్ & సన్స్' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాబడుతోంది. ఈ పాజిటివ్ మౌత్ టాక్ కార‌ణంగా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తోంది.'విశ్వనాథ్ & సన్స్' కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 74.47 కోట్ల గ్రాస్ వసూలు సాధించిన‌ట్లు 'సాక్నిల్క్' వెల్ల‌డించింది. విశేషమేమిటంటే.. తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఇది సినిమాపై ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనంగా నిలుస్తోంది. కేవలం స్వదేశంలోనే కాకుండా, ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం దుమ్మురేపుతోంది. ముఖ్యంగా అమెరికా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అరుదైన మైలురాయిని చేరుకుంది.యూఎస్‌లో ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల మార్కును దాటినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సూర్య కెరీర్‌లో అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్లు వసూలు చేసిన చిత్రంగా 'విశ్వనాథ్ & సన్స్' సరికొత్త రికార్డు సృష్టించింది. మరోవైపు, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో గత 24 గంటల్లోనే 5,05,710 టికెట్లు అమ్ముడవడం సినిమాకున్న క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది. దాదాపు 5 లక్షలకు పైగా టికెట్లు ఒక్కరోజులో అమ్ముడవడం అసాధారణ స్పందనగా ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.ఈ చిత్రంలో సూర్య సరసన మామితా బైజు హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటీమణులు రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

వ శ వన థ సన స బ క గ స ల జ ర స ర య స న మ క 24 గ టల ల 5 లక షల ట క ట ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in