విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్
Actor ProfileActor

విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్
123Telugu27 Nov 2026
విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలో మేకర్స్ గుడ్ న్యూస్

తమిళ స్టార్ హీరో సూర్య ‘కరుప్పు’ తర్వాత నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 14, 2026న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం చార్ట్‌బస్టర్‌గా నిలవగా, ఇటీవల విడుదలైన ట్రైలర్‌లోని ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. ఇక ఈ చిత్రానికి కోయంబత్తూర్, కొచ్చి ప్రాంతాల్లో నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్లకు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. అలాగే ఆగస్టు 11న జరగబోయే తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై అందరి దృష్టి నెలకొంది. కాగా ఈ సినిమాకు టికెట్ ధరపై మేకర్స్ ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ చిత్రానికి ఎలాంటి టికెట్ రేట్ల పెంపు ఉండబోదని వారు చెబుతున్నారు. దీంతో ప్రేక్షకులకి పెద్ద ఊరట లభించిందని చెప్పాలి. ఫ్యామిలీ ఆడియెన్స్ భారీగా థియేటర్లకు వస్తారనే ధీమాతో చిత్రబృందం ఈ మేరకు నిర్ణయం తీసుకుందట. ఈ చిత్రంలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్‌గా అలరించనుండగా రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటించారు

వ శ వన థ అ డ సన స వ షయ ల మ కర స గ డ న య స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in