విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ
Actor ProfileActor

విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ, సూర్య తెలుగు సినిమా ఎలా ఉందంటే
Asianet News Telugu19 Dec 2026
విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ, సూర్య తెలుగు సినిమా ఎలా ఉందంటే

సూర్య చివరగా `కరుప్పు` చిత్రంతో విజయాన్ని అదుకున్నారు. చాలా రోజుల తర్వాత బ్లాక్‌ బస్టర్ అందుకొని కమ్‌ బ్యాక్‌ ఇచ్చారు. ఇప్పుడు ఆయన తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో తెలుగు సినిమా `విశ్వనాథ్‌ అండ్‌ సన్స్` చేశారు. ఇందులో మమితా బైజు హీరోయిన్‌గా నటించగా, రాధిక శరత్‌ కుమార్‌, రవీనా టండన్‌ వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చ్యూర్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(ఆగస్ట్ 14)న తెలుగు, తమిళంలో విడుదలైంది. మరి సూర్య తెలుగు మూవీ ఆకట్టుకుందా? ఆయనకు మరో హిట్‌ పడిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. సంజయ్‌ విశ్వనాథ్‌(సూర్య) బిగ్‌ కార్పొరేట్‌ టైకూన్‌. చిన్నప్పట్నుంచి ఫిస్టల్‌ క్రీడలో రాణించాలనుకుంటాడు. నలభై ఏళ్ల వయసులో ఛాంపియన్‌గా నిలుస్తాడు. దీంతో ఆయనేంటో అందరికి తెలుస్తుంది. అదే సమయంలో దేశంలో ఎవరైనా మ్యానేజ్‌ చేయగల మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్ డ్‌ పర్సన్‌ కూడా. అయితే నలభై దాటినా కూడా పెళ్లి చేసుకోడు. దానికి కారణం తన నాన్న అమ్మ నిర్మలమ్మ(రాధికా శరత్‌ కుమార్‌) ని కాకుండా నటి అంజలి(రవీనా టండన్‌)ని పెళ్లి చేసుకుంటాడు. దీంతో తమని దూరం పెట్టడంతో సంజయ్‌ బాధపడతాడు. తండ్రిని, అంజలి ఫ్యామిలీని హేట్‌ చేస్తాడు. అమ్మనే సర్వస్వంగా బతుకుతాడు. అయితే జీవితంలో అన్నీ సాధించిన తనకు పెళ్లి చేయాలని అమ్మ కోరుకుంటుంది. కానీ సంజయ్‌ నో చెబుతాడు. కానీ అమ్మ కోరిక మేరకు సరోగసి ద్వారా అబ్బాయికి తండ్రి అవుతాడు. అతను చిన్నప్పుడే బోన్‌ మ్యారోకి సంబంధించిన లోపంతో బాధపడతాడు. దానికి తన సరోగసి మదర్‌ కావాల్సి వస్తుంది. ఆమెనే మ్యాడీ(మమితా బైజు). డబ్బు కోసం ఆ పని చేస్తుంది. తనకు ఎవరూ లేరు. ఇప్పుడు సంజయ్‌ రిక్వెస్ట్ మేరకు ఆమె బోన్‌ మ్యారో రీప్లేస్‌మెంట్‌కి ఓకే చెబుతుంది. దీనికోసం సంజయ్‌ ఇంటికి వస్తుంది. ఈ క్రమంలో సంజయ్‌కి ఆమె