విశాఖలో జీసీసీ
Actor ProfilePolitician

విశాఖలో జీసీసీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విశాఖలో జీసీసీ, మూలపేటలో నాఫ్తా క్రాకర్.. ఏపీలో పెట్టుబడులకు ఎల్జీకి మంత్రి లోకేశ్ ఆహ్వానం
AP7AM4 Oct 2026
విశాఖలో జీసీసీ, మూలపేటలో నాఫ్తా క్రాకర్.. ఏపీలో పెట్టుబడులకు ఎల్జీకి మంత్రి లోకేశ్ ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తన దక్షిణ కొరియా పర్యటనలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఎల్జీ కెమ్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాలతో సియోల్‌లో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, శ్రీసిటీ, మూలపేట కేంద్రాలుగా రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు గల అవకాశాలను ఆయన వివరించి, పెట్టుబడులకు ఆహ్వానం పలికారు.విశాఖలో జీసీసీ.. ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌కు లోకేశ్ ప్రతిపాదనలు సియోల్‌లోని ఎల్జీ ట్విన్ టవర్స్‌లో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గ్లోబల్ సీఈవో ల్యూ జె చెయోల్, ఇండియా సీఈవో హాంగ్ జు జియోన్‌లతో మంత్రి లోకేశ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్జీ సంస్థ తన నోయిడా, బెంగళూరు ప్రాజెక్టుల తరహాలో విశాఖపట్నంలో ఒక గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ) లేదా ఇంజనీరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనితో పాటు శ్రీసిటీ, దాని పరిసర ప్రాంతాలలో డిస్‌ప్లే మాడ్యూల్స్, సెన్సర్లు, పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి విడిభాగాల తయారీ యూనిట్‌ను స్థాపించే అవకాశాలను పరిశీలించాలని కోరారు. రాష్ట్రంలో ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించేందుకు ఐఓటీ, రోబోటిక్స్ వంటి అత్యాధునిక రంగాలలో ఇన్నోవేషన్ ల్యాబ్‌ల ఏర్పాటుకు రీసెర్చ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్‌)తో కలిసి పనిచేయాలని సూచించారు. క్యారియర్ సంస్థ తరహాలో వాణిజ్య అవసరాల కోసం చిల్లర్ మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.ఈ సమావేశంలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా సీఈవో హాంగ్ జు జియోన్ మాట్లాడుతూ

వ శ ఖల జ స స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in