
ఇంటర్నెట్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు 18 ఏళ్లపాటు కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇటీవల ఆ బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీఎస్కేకు కొత్త హెడ్‌గా ఎవరొస్తారనే దానిపై క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మొన్నటివరకు ఇంగ్లాండ్ కోచ్‌గా ఉన్న బ్రెండన్ మెక్‌కల్లమ్ (Brendon McCullum) చెన్నై కోచ్‌గా వస్తాడని వార్తలొచ్చాయి. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (Eoin Morgan) కోచ్ పదవి రేసులో ఉన్నాడని సీఎస్కే మాజీ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో చెన్నై కోచ్ అంశంపై టీమ్ఇండియా మాజీ బ్యాటర్ క్రిస్ శ్రీకాంత్ (Kris Srikkanth) స్పందించాడు. ఇయాన్ మోర్గాన్ కోచ్ పదవిపై దృష్టిపెట్టకుండా కామెంటేటరీకి పరిమితమైతే మంచిదని పేర్కొన్నాడు. అలాగే, బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను కూడా కోచ్‌గా నియమించుకోవద్దని సీఎస్కేకు సూచించాడు. బయట వ్యక్తులను కాకుండా ఇప్పుడున్న కోచింగ్ స్టాఫ్‌లో ఓ వ్యక్తికి హెడ్ కోచ్‌గా పగ్గాలు అప్పగించాలన్నాడు. ‘‘నేనైతే ఇయాన్ మోర్గాన్‌ను చెన్నై కోచ్‌గా ఎంచుకోవద్దని చెబుతా. అతడు ఇంగ్లాండ్ తరపున మంచి ఆటగాడిగా, మంచి కెప్టెన్‌గా రాణించాడు. కానీ, కోచ్‌గా మాత్రం అతడిని పరిగణనలోకి తీసుకోను. ఐపీఎల్‌లో కేకేఆర్ కెప్టెన్‌గా కూడా మోర్గాన్ గొప్ప ప్రదర్శనేమీ చేయలేదు. అతడు కామెంటరీకే పరిమితమైతే మంచిది. అలాగే, బ్రెండన్ మెకల్లమ్‌ను హెడ్ కోచ్‌గా నియమించుకోవద్దు. ఇప్పుడు ఇంగ్లాండ్ వన్డే, టీ20 జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. ఇలాంటి తరుణంలో మెక్‌కల్లమ్‌ను కోచ్‌గా నియమించుకుంటే సీఎస్కేకు ఇబ్బందులు తప్పవు. మోర్గాన్, మెక్‌కల్లమ్ ఇద్దరినీ ఆ ఫ్రాంఛైజీ పక్కనపెట్టాలి. తమ వద్ద ‘మిస్టర్ క్రికెట్’ (మైకేల్ హస్సీ) ఉన్నప్పుడు సీఎస్కేకు బయటి వ్యక్తుల అవసరం లేదు. మైకేల్ హస్సీనే ఆటోమేటిక్‌గా ప్రధాన కోచ్ కావాలి. అతడే అత్యుత్తమ ఎంపిక కూడా. ఇకపై సీఎస్కేలో ధోనీ పాత్ర ఏంటి? ముందుగా ఆ విషయంపై స్పష్టత రావాలి. అప్పుడే మిగిలిన విషయాలన్నీ ఒక కొలిక్కి వస్తాయి’’ అని