వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ
Actor ProfilePolitician

వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ
Eenadu14 Jan 2027
వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ

మందమర్రి పట్టణం: తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా, వైద్య రంగ సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఈ క్రమంలోనే 50 వేల టీచర్ల ఉద్యోగాలు భర్తీ చేశామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మోడల్ స్కూల్లో రూ. 50 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణ, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఉద్దేశించి ముందుగా మంత్రి మాట్లాడారు. కోటపల్లి మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజల వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా చెన్నూరులో వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశామని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. అనంతరం ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. భాజపా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నీట్ పేపర్ లీక్ అయిందని తెలిపారు. ఈ విషయమై విద్యార్థులు తాము ఆందోళన చేస్తే అరెస్టు చేశారని చెప్పారు. మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టం మారాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

వ ల ఉప ధ య య ఉద య గ ల భర త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in