వారం రోజుల జిల్లా పర్యటనల తర్వాత రేపు అమరావతికి సీఎం చంద్రబాబు
Actor ProfilePolitician

వారం రోజుల జిల్లా పర్యటనల తర్వాత రేపు అమరావతికి సీఎం చంద్రబాబు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వారం రోజుల జిల్లా పర్యటనల తర్వాత రేపు అమరావతికి సీఎం చంద్రబాబు
AP7AM23 Sept 2026
వారం రోజుల జిల్లా పర్యటనల తర్వాత రేపు అమరావతికి సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు వారం రోజుల సుదీర్ఘ జిల్లాల పర్యటనను ముగించుకుని సోమవారం అమరావతికి తిరిగి రానున్నారు. క్షణం తీరిక లేకుండా నాలుగు జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, సోమవారం నుంచి పరిపాలనపై దృష్టి సారించనున్నారు. సచివాలయానికి చేరుకోగానే ఆర్టీజీఎస్, మూడు ఆర్థిక ప్రాంతాల (ఎకనమిక్ రీజియన్లు) అభివృద్ధిపై సమీక్షలు నిర్వహించనున్నారు.ఈ నెల 1న అమరావతి నుంచి బయలుదేరిన సీఎం చంద్రబాబు నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. నెల్లూరు జిల్లా గూడూరులో 'పేదల సేవలో' కార్యక్రమంలో పాల్గొని, పింఛన్లు పంపిణీ చేశారు. జిల్లాలో మెగా ఫర్నిచర్ పార్కు ఏర్పాటు చేయనున్నామని, వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. అదే రోజు తిరుపతి జిల్లా సత్యవేడులో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు.మరుసటి రోజు, జూలై 2న, తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకం 'వీబీ జీ రామ్ జీ'ని జాతీయ స్థాయిలో ప్రారంభించారు. అనంతరం తిరుపతిలో 'ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్' వర్క్‌షాప్‌లో పాల్గొని, డేటా ఆధారిత పాలన ప్రాముఖ్యతను వివరించారు.జూలై 3న, రాయలసీమ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ కడప జిల్లా సున్నపురాళ్లపల్లిలో జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రూ.16,350 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న ఈ ప్లాంటుతో పాటు, అనుబంధంగా ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్రాజెక్టు పనులనూ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల

వ ర ర జ ల జ ల ల పర యటనల తర వ త ర ప అమర వత క స ఎ చ ద రబ బ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in