వ రోజు రచ్చ చేస్తోన్న కొరియన్ కనకరాజు
Actor ProfileActor

వ రోజు రచ్చ చేస్తోన్న కొరియన్ కనకరాజు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వ రోజు రచ్చ చేస్తోన్న కొరియన్ కనకరాజు, బాక్సాఫీస్ ఎంత కలెక్ట్ చేసిందంటే
Asianet News Telugu20 Nov 2026
వ రోజు రచ్చ చేస్తోన్న కొరియన్ కనకరాజు, బాక్సాఫీస్ ఎంత కలెక్ట్ చేసిందంటే

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా హారర్ కామిడీ మూవీ ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. అద్భుతమైన వసూళ్లతో ముందడుగు వేస్తోంది. విడుదలైన మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా, రెండవ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తూ ప్రపంచవ్యాప్తంగా రూ. 12 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు ఈ సినిమా వసూళ్లలో పెరుగుదల నమోదైంది. సాధారణంగా టాక్ ఏమాత్రం తేడా కొట్టినా శని, ఆదివారాల్లో కూడా కలెక్షన్లు పడిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే, ‘కొరియన్ కనకరాజు’ విషయంలో అలా జరగకుండా రెండవ రోజు కలెక్షన్లు పుంజుకోవడం మూవీ టీమ్ కు రిలీఫ్ ను ఇచ్చింది. యాక్షన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ సరైన సమ్మేళనంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయవంతమవుతోంది. భారతదేశంతో పాటు విదేశీ మార్కెట్లలోనూ ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 12 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సంఖ్య భారీ బ్లాక్‌బస్టర్ స్థాయి వసూళ్లు కాకపోయినప్పటికీ, వరుణ్ తేజ్ నటన, హారర్-కామిడీ జానర్‌కు ఉన్న క్రేజ్ కారణంగా సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఒక బలమైన పునాది ఏర్పడింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వరుణ్ తేజ్ ఇమేజ్, మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్ల వైపు నడిపిస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి అందుతున్న పాజిటివ్ "వర్డ్ ఆఫ్ మౌత్" సినిమాకు ప్రధాన బలంగా మారింది. బాక్సాఫీస్ పోటీని తట్టుకుని నిలబడటానికి ఈ వీకెండ్ వసూళ్లు అత్యంత కీలకమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మూడో రోజు, నాలుగో రోజుల్లో ఫుట్‌ఫాల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని, తద్వారా ఈ చిత్రం వారాంతం ముగిసేసరికి మరిన్ని రికార్డు వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు