వారణాసి’లో హనుమంతుడి పాత్ర.. నిజమేనా
Actor ProfileActor

వారణాసి’లో హనుమంతుడి పాత్ర.. నిజమేనా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వారణాసి’లో హనుమంతుడి పాత్ర.. నిజమేనా
123Telugu24 Nov 2026
వారణాసి’లో హనుమంతుడి పాత్ర.. నిజమేనా

దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు కలయికలో రాబోతున్న సినిమా ‘వారణాసి’. ఈ సినిమా పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ప్రియాంక ఈ సినిమాలో మందాకినిగా కనిపిస్తూ ఉండగా.. మహేశ్ రుద్రగా.. శ్రీరాముడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సహజంగా రాముడు పాత్ర ఉంటే.. హనుమంతుడి పాత్ర కూడా ఉంటుంది. మరి ఇప్పుడు ఆ పాత్రలో ఎవరు నటిస్తున్నారు ?, ‘హనుమంతుడి’గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. నిజంగానే ఈ వార్తలో వాస్తవం ఉందా ?, మరి చూడాలి ఏది నిజమో. కాగా ‘వారణాసి’ క్లైమాక్స్‌ను భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారట. ‘వారణాసి’ చిత్రం రూ.1300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను కెఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తుండగా, కథా కథనాన్ని విజయేంద్ర ప్రసాద్ రూపొందించారు. ఇక ఈ సినిమాకి దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు

వ రణ స ల హన మ త డ ప త ర న జమ న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in