వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు
Actor ProfileActor

వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు
123Telugu19 Nov 2026
వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు

ప్రస్తుతం మన ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న అవైటెడ్ చిత్రాల్లో ఒకటే ‘వారణాసి’. గ్లోబల్ మార్కెట్ టార్గెట్ గా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ఎపిక్ చిత్రం నుంచి నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన సర్ప్రైజ్ స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాని టేకోవర్ చేసాయి. అయితే చిత్ర యూనిట్ ఈ సినిమాలో మహేష్ బాబు రోల్ పై ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ రివీల్ చేసారు. “రుద్ర తన జీవితాన్ని మించిన కార్యాన్ని చేయడానికి జన్మించిన ఒక కారణ జన్ముడు, తను అడగని విధిని తాను మోస్తాడు. అతను చమత్కారిగా కనిపిస్తాడు అలానే సాఫ్ట్ గా అదే సమయంలో ఒక రుద్రునిగా కూడా కనిపిస్తాడు. అయితే రౌద్రంగా ఎవరైనా చేస్తారు కానీ సున్నితత్వంతో పాటుగా చాలా తక్కువమంది కనిపిస్తారు. అలాంటి వారిలో ఒక్క మహేష్ మాత్రమే చెయ్యగలడు” అని తెలిపారు. ఈ ఫ్రేమ్‌లు మా ఆఫ్రికా షెడ్యూల్‌ లోనివి, ఏ సెట్ కూడా ఇవ్వలేని అనుభూతిని ఆ ప్రదేశం మాకు అందించింది. కిలిమంజారో, మసాయి మారాలో షూట్ చేస్తుండగా, నేను నివ్వెరపోయాను. కొన్ని ఉదయాన్నే, మా కళ్ల ముందున్న దృశ్యాన్ని 1.43:1 ఐమాక్స్ ఫ్రేమ్ కూడా బంధించలేదేమో అని నాకు అనిపించింది.” అని జక్కన్న వారణాసి ఎక్స్ పీరియన్స్ ని షేర్ చేసుకున్నారు

వ రణ స ల మహ ష ర ల ర వ ల చ స న జక కన న మహ ష మ త రమ చ య యగలడ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in