దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న భారీ అడ్వెంచరస్ చిత్రం ‘ వారణాసి ’. అంతర్జాతీయ స్థాయిలో భారీ విజన్తో తెరకెక్కుతోన్న ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ప్రస్తుతం భారతీయ చిత్రసీమలోనే కాకుండా అంతర్జాతీయంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.సోషల్ మీడియాను ఊపేస్తున్న 'రుద్ర' పోస్టర్లుమహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం (ఆగస్టు 9) ఈ సినిమా నుంచి మేకర్స్ సర్ప్రైజ్ గిఫ్ట్ అందించారు. చిత్రంలో మహేశ్ పోషిస్తున్న ‘రుద్ర’ పాత్రకు సంబంధించిన రెండు సరికొత్త పోస్టర్లను రాజమౌళి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ పిక్‌లో పొడవాటి జుట్టు, గడ్డంతో రఫ్ అండ్ టఫ్ అవతార్‌లో కనిపించారు. ఒక పోస్టర్లో ప్రకృతికి దగ్గరగా అడవి నేపథ్యంలో సీరియస్ లుక్తో అలరించగా, మరొక పిక్‌లో వెదురు తెప్పపై పడుకుని శత్రువుల కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది.రాజమౌళి ఈ పోస్టర్లను షేర్ చేస్తూ.. "‘‘వారణాసి’లో రుద్ర... ఉగ్ర రూపం ఒక్కటే ఆయన నైజం కాదు’ అని ఆసక్తికరంగా క్యాప్షన్ జత చేశారు. మహేశ్ బర్త్‌డే వేళ టీజర్ లేదా గ్లింప్స్ వస్తుందని భావించిన అభిమానులకు, ఈ పిక్స్ మాత్రం నెవర్ బిఫోర్ స్టన్నింగ్ ఫీస్ట్లా మారాయి. పిక్స్ పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్లలో ట్రెండింగ్గా మారి నెట్టింట రికార్డు వ్యూస్తో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.ఇండియన్ స్క్రీన్‌పై విజువల్ వండర్ఈ సినిమా కథాంశం వారణాసి నగరానికి దూసుకొచ్చే ‘శాంభవి’ అనే భారీ ఉల్క (asteroid) ప్రమాదం చుట్టూ తిరుగుతుందని సమాచారం. కాలాల సరిహద్దులను చెరిపేస్తూ త్రేతాయుగం నుంచి కలియుగం వరకు, అలాగే ఆఫ్రికన్ అడవులు, అంటార్కిటికా మంచు ఖండాల నుంచి ప్రాచీన రోమ్ వరకు సాగే అడ్వెంచరస్ టైమ్ ట్రావెల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రాజమౌళి దిద్దుతున్నారు. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా జోనాస్ ‘మందాకిని’ అనే ఫైరిష్ క్యారెక్టర్లో నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్
Actor ProfileActor
వారణాసి’ నుంచి 'రుద్ర' మాస్ లుక్... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేశ్ బర్త్ డే పోస్టర్స్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•18 Nov 2026
వారణాసి’ నుంచి 'రుద్ర' మాస్ లుక్... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేశ్ బర్త్ డే పోస్టర్స్