
ఇంటర్నెట్ డెస్క్: మహేశ్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రానున్న చిత్రం ‘వారణాసి’ (Varanasi). నేడు మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. రుద్రని పరిచయం చేస్తూ రాజమౌళి పోస్ట్ పెట్టారు. ‘రౌద్రం ఒక్కటే అతడి స్వభావం కాదు’ అనే క్యాప్షన్ పెట్టారు (Varanasi Mahesh Look). ‘రుద్ర’ అనగానే మనకు తీవ్రమైన కోపం, మాస్ యాక్షన్ లేదా భీకరమైన రూపం గుర్తుకొస్తుంది. కానీ రాజమౌళి ఈ ఫొటోలతో.. ఈ పాత్రలో కేవలం కోపం కాకుండా ప్రశాంతత, లోతైన ఆలోచనలతో మరిన్ని భిన్నమైన షేడ్స్ కూడా ఉంటాయని స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా క్లాస్, హ్యాండ్సమ్ లుక్స్‌లో కనిపించే మహేష్ బాబు ఈ ఫొటోల్లో ఒత్తైన జుట్టు, గడ్డం మీసాలతో పూర్తి మాస్, రగ్గడ్ అడ్వెంచరర్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడిగా మహేశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రపంచంతో పాటు కాలాల్ని చుట్టేసే సాహసికుడి కథగా ఇది ముస్తాబవుతున్నట్లు తెలిసిందే. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి చిత్రీకరణ పూర్తి చేసి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు (Varanasi Shooting Update). గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు