వియత్నాం బోటు ప్రమాదం.. మృతుల వివరాలు వెల్లడించిన భారత ఎంబసీ
Actor ProfilePolitician

వియత్నాం బోటు ప్రమాదం.. మృతుల వివరాలు వెల్లడించిన భారత ఎంబసీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వియత్నాం బోటు ప్రమాదం.. మృతుల వివరాలు వెల్లడించిన భారత ఎంబసీ
Samayam Telugu1 Nov 2026
వియత్నాం బోటు ప్రమాదం.. మృతుల వివరాలు వెల్లడించిన భారత ఎంబసీ

వియత్నాం బోటు ప్రమాదంలో మొత్తం 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు మహిళలు, 13 మంది పురుషులు ఉన్నారు. లావా మొబైల్ తయారీ సంస్థ భారత్‌లోని తన డీలర్లను బిజినెస్ ట్రిప్‌ కోసం వియత్నాం తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. మృతుల్లో అత్యధికంగా 10 మంది తమిళనాడు రాష్ట్రానికి చెందినవారే కావడం బాధాకరం. ముగ్గురు ఆంధ్రప్రదేశ్, ఇద్దరు కేరళకు చెందిన వారిగా గుర్తించారు. ఈ మేరకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం మృతుల వివరాలను వెల్లడించింది. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. తమిళనాడుకు చెందిన బాధితులకు అన్ని విధాలుగా సహాయం అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. భారత్ నుంచి మొత్తం 250 మంది వెళ్లగా.. దక్షిణాదిలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకల నుంచి 110 మంది ఉన్నారు.మృతుల వివరాలుఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముడియం శ్రీధర్ (కడప), గెల్లి జయలక్ష్మి (మచిలీపట్నం), నల్లపేట రవితేజ (హిందూపురం), తమిళనాడుకు చెందిన సెంథిల్ కుమార్, మురుగన్ ప్రభు, శ్రీధర్ సుందరరాజన్, షేక్ అబ్దుల్లా, బాలాజీ నటేషన్, వినయ్ కుమార్, రవిశంకర్ సుకుమారన్, సంతోష్ కుమార్, బాబు కుప్పుస్వామి, అలగురాజన్.. కేరళకు చెందిన అవికోట్ చేర్యన్, లోవెని.వియత్నాం విషాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం, కాన్సులేట్‌లు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాయని, స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని మోదీ వివరించారు.ప్రముఖ పర్యాటక కేంద్రం ‘ఫు క్వాక్’ ద్వీపం వద్ద భారతీయ టూరిస్ట్‌లు ప్రయాణిస్తున్న పడవ బోల్తాపడింది. దీంతో అందులోని 32 మంది టూరిస్ట్‌లు, నలుగురు సిబ్బంది సహా 36 మంది సముద్రంలో పడిపోయారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది