Attari Border E-Visa Approval : భారత్‌ను సందర్శించే అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రయాణ సౌలభ్యాన్ని మరింత పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ప్రముఖ అట్టారీ ల్యాండ్ పోర్టుతో పాటు మరో 10 అంతర్జాతీయ కేంద్రాలోకి ఈ-వీసా హోల్డర్లకు ప్రవేశాన్ని కల్పిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నూతన నోటిఫికేషన్ విడుదల చేసింది. తొమ్మిది ల్యాండ్ పోర్టులు, రెండు విమానాశ్రయాలను ఈ జాబితాలో చేర్చడంతో.. దేశవ్యాప్తంగా ఈ-వీసా ద్వారా భారత్‌లోకి ప్రవేశించడానికి అనుమతి ఉన్న అంతర్జాతీయ కేంద్రాల సంఖ్య ఏకంగా 88కి చేరింది.కేంద్రం తాజాగా విడుదల చేసిన సవరించిన నిబంధనల ప్రకారం.. విదేశీ ప్రయాణికులకు ప్రవేశం కల్పించే మొత్తం 88 కేంద్రాలలో 37 విమానాశ్రయాలు, 38 ఓడరేవులు, 13 ల్యాండ్ పోర్టులు ఉన్నాయి. అయితే కొత్తగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం తిరుపతి విమానాశ్రయాలను కొత్తగా ఈ-వీసా జాబితాలో చేర్చారు. అలాగే కొత్తగా పంజాబ్‌లోని అట్టారీతో పాటు రక్సాల్, రూపైడిహా, జోగ్బానీలతో పాటు దర్రంగా, గెడే, ఘోజాదంగా, హరిదాస్‌పూర్, జైగావ్, డావ్కీ, మోరే సరిహద్దు ప్రాంతాలను ఈ-వీసా చెక్‌పోస్టులుగా గుర్తించారు.పాకిస్థాన్ పౌరులకు ఈ సదుపాయం వర్తించదు!విదేశీయులకు ఈ-వీసా నిబంధనలను ఎంతగా సడలించినప్పటికీ.. పాకిస్థాన్ పౌరులకు మాత్రం ఈ సదుపాయాన్ని దూరంగా ఉంచారు. పాకిస్థానీ పాస్‌పోర్టు కలిగిన వ్యక్తులకు లేదా పాకిస్థానీ మూలాలు ఉన్న ప్రయాణికులకు భారత్ ఎలాంటి ఈ-వీసాలను మంజూరు చేయడం లేదు. అలాంటివారు సాధారణ పద్ధతిలోనే విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు లేదా కాన్సులేట్ ద్వారా నేరుగా రెగ్యులర్ వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఈ-పోర్టల్ స్పష్టం చేసింది.172 దేశాలకు విస్తరించిన ఈ-వీసా వ్యవస్థ!భారత వీసా నిబంధనలను సులభతరం చేస్తూ 2014లో కేవలం 43 దేశాల పౌరుల కోసం ప్రారంభించిన ఈ-వీసా సేవలు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 172 దేశాల పౌరులకు అందుబాటులోకి వచ్చాయి. టూరిస్ట్, బిజినెస్, మెడికల్, స్టూడెంట్, గ్రూప్
Actor ProfilePolitician
విదేశీ ప్రయాణికులకు భారత్ బిగ్ రిలీఫ్.. అట్టారీ సరిహద్దు సహా 11 కొత్త కేంద్రాలకు ఈ
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•1 Dec 2026
విదేశీ ప్రయాణికులకు భారత్ బిగ్ రిలీఫ్.. అట్టారీ సరిహద్దు సహా 11 కొత్త కేంద్రాలకు ఈ-వీసా సదుపాయం