విద్యార్ధులకు బిగ్ అప్డేట్
Actor ProfilePolitician

విద్యార్ధులకు బిగ్ అప్డేట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విద్యార్ధులకు బిగ్ అప్డేట్, కాలేజీల బంద్ - కీలక డిమాండ్
Oneindia Telugu6 Nov 2026
విద్యార్ధులకు బిగ్ అప్డేట్, కాలేజీల బంద్ - కీలక డిమాండ్

మరోసారి కాలేజీలు బంద్ కానున్నాయి. విద్యార్ధి సంఘాలు కాలేజీల బంద్ కు పిలుపునిచ్చాయి. సుదీర్ఘ కాలంగా ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా ఫలితం కనిపించ లేదు. ఇప్పటికే ఈ వ్యవహారం హైకోర్టులో విచారణలో ఉంది. కాగా, ప్రభుత్వ తీరుకు నిరసనగా ABVP విద్యార్థి సంఘం ఈ నెల 14న కాలేజీల బంద్ కు పిలుపు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీల బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ ఈనెల 14న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌ చేస్తున్నట్లు ఏబీవీపీ ప్రకటించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. జూనియర్ కళాశాలల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలను మూసివేసి, ఈ బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణలో దాదాపు 20 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులు ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి ఉన్నత చదువులు చదువుకొంటున్నారని విద్యార్ధి సంఘ నేతలు చెబుతున్నారు. కాగా, రాష్ట్రంలో ఏకంగా రూ. 11,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నట్లు వివరించారు. జైలుకు వెళ్తే పదవి తొలిగించే బిల్లులో బిగ్ ట్విస్ట్, ఆపరేషన్ - 2029..!!ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల కోసంప్రభుత్వ తీరు కారణంగా ప్రతీ ఏటా లక్షలాది మంది పేద విద్యార్ధులు చదవు మధ్యలోనే ఆపేస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేసారు. చదువు పూర్తయిన 4.5 లక్షల మంది విద్యార్థులు కాలేజీల్లో ఫీజులు కట్టలేక ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ పరిస్థితి కారణంగా ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు దూరమై పక్క రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేయలేదని.. తాము అధికారంలోకి రాగానే బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చి.. అమలు చేయటం లేదని మండిపడుతున్నారు. విద్యా శాఖ