విద్యార్థులకు సీఎం రేవంత్ శుభవార్త.. నేరుగా అకౌంట్లలోకి ఫీజు రీయింబర్స్ మెంట్
Actor ProfilePolitician

విద్యార్థులకు సీఎం రేవంత్ శుభవార్త.. నేరుగా అకౌంట్లలోకి ఫీజు రీయింబర్స్ మెంట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విద్యార్థులకు సీఎం రేవంత్ శుభవార్త.. నేరుగా అకౌంట్లలోకి ఫీజు రీయింబర్స్ మెంట్
Zee Telugu23 Dec 2026
విద్యార్థులకు సీఎం రేవంత్ శుభవార్త.. నేరుగా అకౌంట్లలోకి ఫీజు రీయింబర్స్ మెంట్

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana Fee Reimbursement: స్వాతంత్ర్య దినోత్సవం వేళ తెలంగాణ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని అందజేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులకు విద్యా బోధనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్త కూడదనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం రూ. 2,400 కోట్ల నిధులు ముందస్తుగానే బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు రేవంత్ ప్రకటించారు. విద్యార్థులు ఎవరినీ ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా, డబ్బులు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోనే స్కాలర్ షిప్ సొమ్మ జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు సాధించాలంటే కేవలం డిగ్రీలు ఉంటే సరిపోవని, టెక్నికల్ స్కిల్స్ కడా ఎంతో సీఎం రేవంత్ విద్యార్థులకు సూచించారు. 10వ తరగతి పూర్తైన వెంటనే విద్యార్థులు ITI కోర్సుల ద్వారా వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని పెంచుకోవచ్చని సీఎం చెప్పారు. నర్సింగ్ విద్య అభ్యసించిన వారికి జపాన్, జర్మనీ, కొరియా తదితర విదేశాలలో లక్షల రూపాయల ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. యువతలో తగిన నైపుణ్యం, సామర్థ్యం ఉంటే.. వారిని విదేశాలకు పంపించి మంచి ఉద్యోగావకాశాలు కల్పించే బాధ్యతను తనదేనని రేవంత్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యా రంగానికి ప్రాధాన్యతనిచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్వాన్స్ ఫీజు రీయింబర్స్‌మెంట్లను అందించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ చొరవలో భాగంగా, ఈ ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ల మొదటి విడతగా రూ.250 కోట్లను నేరుగా బ్యాంకుల్లో జమ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని అర్హులైన పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు