విద్యార్థినుల వింత ప్రవర్తనతో గందరగోళం
Actor ProfilePolitician

విద్యార్థినుల వింత ప్రవర్తనతో గందరగోళం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విద్యార్థినుల వింత ప్రవర్తనతో గందరగోళం
Eenadu26 Dec 2026
విద్యార్థినుల వింత ప్రవర్తనతో గందరగోళం

రాయగడ పట్టణం: పలువురు విద్యార్థినులు వింతగా ప్రవర్తించడం గందరగోళానికి గురిచేసింది. దేబగడ జిల్లా బార్కోటె సమితి పొడియానాలి గ్రామంలో ప్రభుత్వ యూపీ పాఠశాలలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. జెండా వందనం పూర్తయ్యాక సాంస్కృతిక కార్యక్రమాలు మొదలు కాగానే ఓ విద్యార్థిని ఏడుస్తూ వింతగా ప్రవర్తించింది. కొద్ది సేపటికే మరో ఎనిమిది మంది అదే విధంగా ప్రవర్తించారు. దీంతో బాధితుల్లో ముగ్గురిని బార్కోటె సీహెచ్‌సీలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మిగతా వారిని స్థానిక మహామయి మందిరంలో పూజలు నిర్వహించేందుకు బాధిత కుటుంబీకులు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి గెందేర కుజుర్ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థుల పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతానికి విద్యార్థుల పరిస్థితి బాగానే ఉందని, వారు అలా ప్రవర్తించడానికి గల కారణాలు తెలియరాలేదని వైద్యులు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

వ ద య ర థ న ల వ త ప రవర తనత గ దరగ ళ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in