
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Education GDP Percentage India: సాధారణంగా ఏ దేశం అయినా సరే అభివ్రుద్ధి పథంలో పయనించాలంటే విద్యారంగానికి ఇచ్చే ప్రాధాన్యతే ముఖ్యం. కానీ మన దేశం తన బడ్జెట్లో విద్యకు కేటాయిస్తున్న నిధుల వాటా ఏటికేడు తగ్గిపోతుండటం కలవరపెడుతోంది. యునెస్కో నిర్దేశించిన అంతర్జాతీయ కనీస ప్రమాణాలను కూడా మన భారతదేశంలో అందులేకపోయిందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. విద్యను మెరుగుపరచడానికి, పాఠశాలల పరిస్థితిని మెరుగుపరచడానికి.. ప్రభుత్వ పాఠశాలల పిల్లలు సంఖ్య పెంచేందుకు.. దేశంలో అనేక పథకాలు అమలు అవుతున్నాయి. కానీ ప్రభుత్వం విద్యారంగానికి కేటాయిస్తున్న వ్యయం విషయానికి వచ్చేసరికి భిన్నంగా ఉంది. యునెస్కో 2026 ఎస్డీజీ 4 స్కోర్‌బోర్డ్ ప్రకారం, భారతదేశం తన మొత్తం ప్రభుత్వ వ్యయంలో 14.2శాతం విద్యపై ఖర్చు చేస్తోంది. ఇది యునెస్కో నిర్దేశించిన 15శాతం కనీస ప్రమాణం కంటే తక్కువ. అంటే ఈ విషయంలో భారతదేశం ఇప్పటికీ లక్ష్యం కంటే వెనుకబడి ఉందని అర్థం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. భారతదేశం తన జీడీపీలో 4.1శాతం విద్యపై ఖర్చు చేస్తుంది. ఇది యునెస్కో నిర్దేశించిన కనీస ప్రమాణం 4శాతం కంటే కొంచెం ఎక్కువ. అయినప్పటికీ, మొత్తం ప్రభుత్వ బడ్జెట్‌లో విద్య వాటా క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2015లో ఇది 15.7శాతం ఉండగా, ఇప్పుడు 14.2శాతానికి పడిపోయింది. అంటే, దాదాపు ఒక దశాబ్ద కాలంలో విద్య వాటా 1.5 శాతం పాయింట్లు తగ్గిపోయింది. విద్యా వ్యయం అంశం కూడా ముఖ్యమైనది.. ఎందుకంటే భారతదేశం ప్రస్తుతం తన పాఠశాల విద్య పూర్తి చేసే లక్ష్యాల విషయంలో చాలా వెనకబడి ఉంది. యునెస్కో గణాంకాల ప్రకారం, 2025 నాటికి జాతీయ లక్ష్యం 99శాతం కాగా