వందేమాతరం వివాదం..కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ
Actor ProfilePolitician

వందేమాతరం వివాదం..కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వందేమాతరం వివాదం..కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై పోలీస్ కేసు నమోదు
Zee Telugu2 Jan 2027
వందేమాతరం వివాదం..కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై పోలీస్ కేసు నమోదు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Sonia Gandhi Vande Mataram Case: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని జాతీయ కాంగ్రెస్ కార్యాలయంలో 'వందేమాతరం' గీతాలాపన వేళ తీవ్ర వివాదం చెలరేగింది. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అమర్యాదగా ప్రవర్తించారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తాయి. ఇప్పుడు ఈ పరిణామాలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. జాతీయ గేయాన్ని అవమానించారనే ఆరోపణలతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కర్ణాటకలో బీజేపీ నేతలు అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఢిల్లీలోని ఏఐసీసీ (కాంగ్రెస్) ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ గేయం (వందేమాతరం) పాడుతున్న సమయంలో సోనియా గాంధీ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. వందేమాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించారంటూ కర్ణాటకలోని మంగళూరు ఉర్వా పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నాయకులు ఆదివారం ఫిర్యాదు దాఖలు చేశారు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన తర్వాత వందేమాతరం గీతాలాపన జరుగుతుండగా వేదికపై ఉన్న సోనియా గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడుతూ, గీతాన్ని మధ్యలోనే ఆపేయాలన్నట్లుగా సైగలు చేశారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సోనియా గాంధీ చేసిన ఈ ప్రవర్తనపై సర్వత్రా విమర్శలకు దారితీసింది. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు మరో విషయంపై సోనియా గాంధీ మాట్లాడారని.. జాతీయ గీతం ఆపేయాలంటూ వచ్చిన వ్యాఖ్యలను వారు తప్పుబట్టారు. అయితే వందేమాతరం పాడే సమయంలో అలా కదలాడి, మాట్లాడాల్సిన అవసరం ఏమిటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు

వ ద మ తర వ వ ద క గ ర స అగ రన త స న య గ ధ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in