వెండితెర ధృవతారకు అక్షర నీరాజనం.. ఘనంగా సావిత్రి క్లాసిక్స్’ పుస్తకావిష్కరణ
Actor ProfileActor

వెండితెర ధృవతారకు అక్షర నీరాజనం.. ఘనంగా సావిత్రి క్లాసిక్స్’ పుస్తకావిష్కరణ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వెండితెర ధృవతారకు అక్షర నీరాజనం.. ఘనంగా సావిత్రి క్లాసిక్స్’ పుస్తకావిష్కరణ
Samayam Telugu27 Oct 2026
వెండితెర ధృవతారకు అక్షర నీరాజనం.. ఘనంగా సావిత్రి క్లాసిక్స్’ పుస్తకావిష్కరణ

తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ అద్భుత నటి, వెండితెర ధృవతార మహానటి సావిత్రి 90వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. సంజయ్ కిషోర్ ఎంతో పరిశోధన చేసి రచించిన ‘ సావిత్రి క్లాసిక్స్ ’ (Savitri Classics) ఆంగ్ల ఎడిషన్ పుస్తకావిష్కరణ వేడుక శుక్రవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు సీనియర్ నటీమణి జయప్రద , ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం , ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, కేఐ వరప్రసాద్ రెడ్డి, నిర్మాత నాగ సుశీల, సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరితో పాటు జయలలిత, బొల్లినేని కృష్ణయ్య తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా జయప్రద పుస్తకాన్ని ఆవిష్కరించి, తొలి ప్రతిని రఘురామ కృష్ణంరాజుకు అందజేశారు.* అయ్యగారి బాక్సాఫీస్ సునామీ.. పాత రికార్డులన్నీ బద్దలు కొడుతూ ‘లెనిన్’ రికార్డ్ ఓపెనింగ్స్సావిత్రమ్మను చూసినట్లే ఉంది: జయప్రద ఎమోషనల్పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం సీనియర్ నటి జయప్రద వేదికపై భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె మాట్లాడుతూ.. "ఎన్నో జన్మల పుణ్యఫలం వల్లే ఇలాంటి గొప్ప వేదిక పంచుకునే భాగ్యం దక్కింది. గతంలో ఈ పుస్తకం తెలుగు వర్షన్‌ను నాకు ఎంతో ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి గారు విడుదల చేశారు. ఇప్పుడు దీని ఇంగ్లీష్ ఎడిషన్‌ను ఆవిష్కరించే అవకాశం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సావిత్రమ్మ కుమార్తె చాముండేశ్వరి మా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించినప్పుడు, సావిత్రి గారే స్వయంగా మా ఇంటికి వచ్చినట్లు అనిపించింది" అని పేర్కొన్నారు. సావిత్రి నటనా వైభవాన్ని గుర్తుచేసుకుంటూ.. "సావిత్రి అంటేనే ఉత్తమ నటనకు నిఘంటువు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి లెజెండరీ హీరోలకు ధీటుగా నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఏకైక నటి ఆమె. ఆమె కళ్లల్లోనే ఎన్నో హావభావాలు పలికేవి. ఆమె నటించిన కాలంలో నేను పుట్టకపోయినా, ఆమె సినిమాలు చూస్తూనే నేను నటన

వ డ త ర ధ వత రక అక షర న ర జన ఘన గ స వ త ర క ల స క స ప స తక వ ష కరణ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in