విడాకులు వెనక్కి.. అయినా సీక్రెట్ మ్యారేజ్ ప్లాన్
Actor ProfileActor

విడాకులు వెనక్కి.. అయినా సీక్రెట్ మ్యారేజ్ ప్లాన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
విడాకులు వెనక్కి.. అయినా సీక్రెట్ మ్యారేజ్ ప్లాన్
Sakshi25 Jan 2027
విడాకులు వెనక్కి.. అయినా సీక్రెట్ మ్యారేజ్ ప్లాన్

బాలీవుడ్‌ నటుడు గోవింద, ఆయన భార్య సునీత అహుజా మధ్య వివాహ వివాదం మరో మలుపు తిరిగింది. 2024లో దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఇటీవలే సునీత వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన సహనటి కోమల్‌ రాణి స్వర్ణకర్‌ను రహస్యంగా వివాహం చేసుకోబోతున్నారంటూ ఓ వార్త బాంబ్‌లా పేలింది. ఈ బాంబ్‌ పేల్చింది ఎవరో కాదు.. గోవింద సతీమణి సునీతనే!. ముంబైలో నటి రాఖీ సావంత్‌ మీడియాతో మాట్లాడుతున్న గోవిందా భార్య సునీతతో ఫోన్‌ కలిపారు. ఈ సంభాషణలో తనపై సోషల్‌ మీడియాలో వస్తున్న విమర్శల గురించి సునీత ప్రస్తావించారు. ఇదే సమయంలో గోవింద, కోమల్‌ రాణి పెళ్లి చేసుకునేందుకు ప్రణాళికలు వేసుకున్నారని ఆమె చెప్పారు. “నేను నిన్నే విడాకుల కేసును వెనక్కి తీసుకున్నాను. అయితే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకునే ప్లాన్‌లో ఉన్నారు” అని సునీత వ్యాఖ్యానించించారు. అదే సమయంలో కోమల్‌ రాణిని సునీత ‘చికెన్‌ టిక్కా’ అంటూ సంబోధించడం కూడా చర్చనీయాంశంగా మారింది. సునీతకు రాఖీ సలహా ఈ సందర్భంగా రాఖీ సావంత్‌ సునీతకు మద్దతుగా మాట్లాడారు. గోవిందకు సంబంధించినట్లు చెబుతున్న రూ.200 కోట్ల ఆస్తిపై దృష్టి పెట్టాలని, ఇతర విషయాలను పక్కన పెట్టి ఆస్తులను తన పేరుపై భద్రపరుచుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలకు సునీత స్పందించగా.. విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో గోవింద, కోమల్‌ పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని బాంబ్‌ పేల్చారు. కింగ్‌ ఆఫ్‌ కామెడీగా.. బాలీవుడ్‌ నటుడు గోవిందా 90వ దశకంలో తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌, ప్రత్యేకమైన డ్యాన్స్‌ స్టైల్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ‘కూలీ నంబర్‌ 1’, ‘హీరో నంబర్‌ 1’, ‘రాజా బాబు’, ‘దుల్హే రాజా’ వంటి హిందీ చిత్రాల రీమేక్‌ వెర్షన్ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడు. 1963 డిసెంబర్‌ 21న జన్మించిన ఆయన అసలు పేరు గోవింద్‌ అరుణ్‌ అహూజా. ప్రస్తుతం ఆయన వయసు 62