వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ రాజీనామా.. ట్రంప్ సీనియర్ సలహాదారుగా కొత్త బాధ్యతలు
Actor ProfilePolitician

వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ రాజీనామా.. ట్రంప్ సీనియర్ సలహాదారుగా కొత్త బాధ్యతలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ రాజీనామా.. ట్రంప్ సీనియర్ సలహాదారుగా కొత్త బాధ్యతలు
TeluguOne13 Dec 2026
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ రాజీనామా.. ట్రంప్ సీనియర్ సలహాదారుగా కొత్త బాధ్యతలు

వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఆ పదవి నుంచి వైదొలిగారు. ఆమె ప్రెస్ సెక్రటరీ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. 28 ఏళ్ల వయసులోనే వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పీఠాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన కరోలిన్ లెవిట్.. ఈ నెల చివర్లో తన విధుల వైదొలగుతారు. ఆమె రాజీనామాకు వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలే కారణమని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన కరోలిన్ లెవిట్.. తన పిల్లలు కుటుంబ సభ్యులతోనూ ఎక్కువ సమయం గడిపేందుకు ప్రెస్ సెక్రటరీ పదవి నుంచి వైదొలగాలని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. కరోలిన్ లెవిట్ రాజీనామాను అధికారికంగా ధృవీకరించిన డొనాల్డ్ ట్రంప్ ప్రెస్ సెక్రటరీగా లెవిట్ రాజీనామా చేసినా పాలనా యంత్రాంగంలో ఆమె పాత్ర ముగిసిపోలేదని, తన సీనియర్ సలహాదారుగా కొత్త బాధ్యతలలో ఉంటారని వెల్లడించారు. తన రాజీనామాపై లెవిట్.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా పనిచేసే అవకాశం ఇచ్చిన ట్రంప్ కు కృతజ్ణతలు తెలిపారు. అధ్యక్షుడి తరఫున వైట్‌హౌస్ వేదికగా నిలబడి మాట్లాడటం తనకు దక్కిన గౌరవంగా చెప్పుకున్న ఆమె.. ట్రంప్ సాధించిన చారిత్రాత్మక విజయాలను నేరుగా అమెరికన్ ప్రజలకు తెలియజేయడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. White House Press Secretary, Karoline Leavitt Resignation, Republican Party, US Politics పట్టపగలే చిమ్మ చీకట్లు.. ఎక్కడో, ఎందుకో తెలుసా?

వ ట హ స ప ర స స క రటర ర జ న మ ట ర ప స న యర సలహ ద ర గ క త త బ ధ యతల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in