వాట్సాప్ 'యూజర్ నేమ్ ' వివాదం.. కేంద్రానికి వివరణ సమర్పించిన మెటా
Actor ProfilePolitician

వాట్సాప్ 'యూజర్ నేమ్ ' వివాదం.. కేంద్రానికి వివరణ సమర్పించిన మెటా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వాట్సాప్ 'యూజర్ నేమ్ ' వివాదం.. కేంద్రానికి వివరణ సమర్పించిన మెటా
AP7AM19 Oct 2026
వాట్సాప్ 'యూజర్ నేమ్ ' వివాదం.. కేంద్రానికి వివరణ సమర్పించిన మెటా

వాట్సాప్ ప్రతిపాదించిన 'యూజర్‌నేమ్‌' ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసులకు మాతృసంస్థ మెటా స్పందించింది. నిన్న‌ తమ వివరణను ఐటీ మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ప్రస్తుతం వాట్సాప్ ఇచ్చిన సమాధానాన్ని పరిశీలిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.ఫోన్ నంబర్ లేకుండా కేవలం యూజర్‌నేమ్‌తో ఇతరులతో కమ్యూనికేట్ అయ్యేలా వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకురావాలని భావించింది. అయితే, దీనివల్ల ఆన్‌లైన్ మోసాలు, ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, ఇంపర్సొనేషన్ (autpersonation) దాడులు భారీగా పెరిగే ప్రమాదం ఉందని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ గత వారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మెటాకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, తమకు సంతృప్తి కలిగే వరకు ఈ ఫీచర్‌ను భారత్‌లో ప్రారంభించవద్దని కఠిన ఆదేశాలు ఇచ్చింది.ప్రభుత్వ నోటీసుల నేపథ్యంలో పూర్తి చర్చలు ముగిసే వరకు ఈ ఫీచర్‌ను భారత్‌లో తీసుకురాబోమని వాట్సాప్ స్పష్టమైన హామీ ఇచ్చింది. తమ యూజర్ల భద్రత కోసం అనేక రక్షణ చర్యలు తీసుకుంటున్నామని కంపెనీ తన వివరణలో పేర్కొంది. ప్రముఖ వ్యక్తులు, ప్రభుత్వ సంస్థలు, సెలబ్రిటీల పేర్లను ఇతరులు దుర్వినియోగం చేయకుండా ఇప్పటికే వాటిని రిజర్వ్ చేశామని తెలిపింది. వాట్సాప్ ఖాతాకు ఫోన్ నంబర్ తప్పనిసరని, యూజర్‌నేమ్‌తో ఎవరైనా మొదటిసారి మెసేజ్ పంపినప్పుడు, వారి వివరాలు (కొత్త ఖాతాదారా, కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నారా, ఏ దేశం వారు) స్పష్టంగా చూపిస్తామని వివరించింది.ఈ అంశంపై ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ మాట్లాడుతూ.. వాట్సాప్ నుంచి సమాధానం అందిందని, దానిని

వ ట స ప య జర న మ వ వ ద క ద ర న క వ వరణ సమర ప చ న మ ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in