వాటర్ బార్లు’ వచ్చేస్తున్నాయ్
Actor ProfileCelebrity

వాటర్ బార్లు’ వచ్చేస్తున్నాయ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వాటర్ బార్లు’ వచ్చేస్తున్నాయ్
Andhra Jyothy30 Oct 2026
వాటర్ బార్లు’ వచ్చేస్తున్నాయ్

పెళ్లి భోజనాలనగానే లగ్జరీగా ఏర్పాట్లు చేస్తున్నారు క్యాటరింగ్‌వాళ్లు. ప్యాకేజ్‌ను బట్టి ఏర్పాట్లు ఉంటున్నాయి. ఒకవైపు ఛాట్‌, మరోవైపు ఫ్రూట్‌ కార్నర్‌, ఇంకోవైపు లైవ్‌ స్వీట్స్‌... అంతేనా... ఐస్‌క్రీమ్స్‌కు ఒక కౌంటర్‌, చైనీస్‌ రుచులకు ఒక కౌంటర్‌... చెప్పుకుంటూపోతే క్యూ పెరుగుతూపోతుంది. రుసుమును బట్టి మినరల్‌ వాటర్‌, బాటిల్డ్‌ వాటర్‌ సరేసరి. ఈ కోవలో ఇటీవల మెట్రో నగరాల్లోని లగ్జరీ పెళ్ళిళ్లలో సరికొత్తగా చేరింది ‘వాటర్‌ బార్‌’. దీనినే ‘హైడ్రేషన్‌ సెంటర్‌’ అని కూడా అంటున్నారు. అంటే రకరకాల ప్రీమియం నీళ్లు పెడుతున్నారు. ఆ విశేషాలే ఇవి... ఈమధ్య హైదరాబాద్‌లోని ఓ భారతీయ ఫుడ్‌ స్టోర్‌లో ‘బ్లైండ్‌ టేస్టింగ్‌’ పోటీలు జరిగాయి. అంటే కళ్లకు గంతలు కడితే, రుచి చూసి ఏమిటో చెప్పే పోటీలన్నమాట. ఈ పోటీ వైన్‌కు సంబంధించినదో, కూల్‌డ్రింకులకు సంబంధించినదో కాదండోయ్‌... మంచినీళ్లకు సంబంధించినది అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఫ్రెంచ్‌ ఆల్ఫ్స్‌ పర్వత హిమపాతాల ‘ఏవియన్‌’, దక్షిణ ఫ్రాన్స్‌లోని వెర్గిజ్‌ నీటి ఊటల ‘పెర్రియర్‌’, ఇటలీలోని ఆల్ఫ్స్‌ పర్వత జలాల ‘శాన్‌ పెల్లెగ్రినో’, ఆరావళి పర్వత జలాల ‘ఆవా’ నీళ్ల శాంపుల్స్‌ రుచి చూస్తూ... వాటిలో ఉన్న ఖనిజాలు, కార్బొనేట్‌ లవణాల గురించి తెలియజేయడమే ఈ పరీక్ష. ఒకప్పుడు ‘వైన్‌ సోమెలియర్‌’ (అంటే వైన్‌ రుచి చూసి చెప్పగల నిపుణులు), ఇప్పుడు కొత్తగా ‘నీళ్ల సోమెలియర్‌’లూ వచ్చేశారు. వీరి డ్యూటీ రకరకాల మంచినీళ్లని రుచి చూసి చెప్పడమే. తాగే నీళ్లు ఎక్కడైనా ఒకటే కదా అనిపించొచ్చు. కానీ అందులో ఎన్నో రుచులూ, ఫ్లేవర్లు ఉన్నాయి. వాటి నాణ్యతను బట్టే నీటి ధర ఉంటుంది. అంటే మనం రోజూ తాగే నీళ్లు కాకుండా, అవన్నీ ప్రీమియం నీళ్లన్నమాట. వాటిని ఎంతమంది తాగుతారనే సందేహం అసలే వద్దు. ఎందుకంటే ఈ ప్రీమియం నీళ్ల బిజినెస్‌ మార్కెట్‌ విలువ ప్రస్తుతం 400 మిలియన్‌ డాలర్లు అంటే నమ్మగలరా? నీటికీ రుచి ఉంటుంది... నదిలో నీళ్ల రుచి ఒకలా

వ టర బ ర ల వచ చ స త న న య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in