
రూ.4 కోట్లతో కేంద్ర గ్రంథాలయ నిర్మాణానికి చర్యలు ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం, న్యూస్‌టుడే సాంస్కృతికం శిథిలావస్థకు చేరి.. చుట్టూ సమస్యలతో అత్యంత దయనీయంగా మారిన జిల్లా కేంద్ర గ్రంథాలయానికి మంచి రోజులు రానున్నాయి. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడి చొరవతో నిత్యనూతనంగా మారేందుకు సిద్ధమవుతోంది. అత్యాధునిక వసతులు కల్పించేందుకు పౌర విమానయాన సంస్థ సీఎస్‌ఆర్ నిధులను మంజూరు చేసింది. ఆ మేరకు త్వరలో పనులు ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ పార్కు వద్ద ఉన్న గ్రంథాలయాన్ని రూ.4 కోట్లతో ఆధునికీకరించనున్నారు. దీనిపై జిల్లా యంత్రాంగం, పౌర విమానయాన సంస్థ గత ఏప్రిల్ 27న ఒప్పందం చేసుకున్నాయి. భవన నిర్మాణ పనులు చేపట్టే బాధ్యతను శ్రీకాకుళం పట్టణాభివృద్ధి సంస్థ(సుడా)కు అప్పగించారు. కార్పొరేట్ స్థాయిలో ప్రశాంతమైన వాతావరణంతో ఉండేలా కార్యాచరణ రూపొందించారు. త్వరగా పూర్తి చేయిస్తాం..: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం అన్ని రంగాల వారికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దాలనేది నా కోరిక. ఈ మేరకు ఇప్పటికే నిధులు మంజూరు చేయించాం. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించేలా కార్యాచరణ రూపొందించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయిస్తాం. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు