
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం తెలిసిందే. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఆయన ‘ఏఏఏ సినిమాస్’ (అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్) పేరుతో మల్టీప్లెక్స్ లు నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఏఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ స్పందిస్తూ, వైజాగ్ నగరంపై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు."ఈ అద్భుతమైన నగరానికి ఏఏఏ సినిమాస్‌ను తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. నా హృదయంలో వైజాగ్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక్కడ ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం మరింత ప్రత్యేకంగా అనిపిస్తోంది" అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సినిమా వీక్షణ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఎంతో ఇష్టపడి ఈ మల్టీప్లెక్స్‌ను తీర్చిదిద్దామని తెలిపారు. ఈ కొత్త ప్రయాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఇప్పటికే ఏఏఏ సినిమాస్ విజయవంతంగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విశాఖపట్నంలో కూడా తమ బ్రాంచ్‌ను విస్తరించడం ద్వారా అల్లు అర్జున్ థియేటర్ వ్యాపారంలో తనదైన ముద్ర వేస్తున్నారు