
కోలీవుడ్ స్టార్, తమిళనాడు సీఎం దళపతి విజయ్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘జననాయగన్’ ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్లుగా టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్, తమిళనాడు సీఎం దళపతి విజయ్ (Vijay) హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘జననాయగన్’ (Jana Nayagan) ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసుకుంది. దాదాపు ఏడు నెలల సుదీర్ఘ నిరీక్షణ, పలు న్యాయపోరాటాల అనంతరం ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. హెచ్. వినోద్ (H Vinod) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా చిత్రం మొత్తం 3 గంటల 3 నిమిషాల సుదీర్ఘ రన్‌టైమ్‌తో థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. రాజకీయ రంగ ప్రవేశం తర్వాత విజయ్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై ట్రేడ్ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. (Jana Nayagan Release Update) రాజకీయ నేపథ్యం ఉన్న కథాంశం కావడంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాను చాలా నిశితంగా పరిశీలించింది. బోర్డు సూచనల మేరకు విజయ్ క్యారెక్టర్ పేరు ఆధారంగా వచ్చే ‘టీవీకే’ డైలాగ్స్ రెఫరెన్స్‌లతో పాటు ఇతర వివాదాస్పద సీన్లను మేకర్స్ మార్చడం, కొన్ని చోట్ల మ్యూట్ చేయడం జరిగినట్లు తెలుస్తోంది. పొలిటికల్ అజెండాతో ముడిపడి ఉన్న సంభాషణలు భవిష్యత్తులో వివాదాలకు దారి తీసే అవకాశం ఉండటంతో చిత్ర బృందం అప్రమత్తంగా వ్యవహరించి ఈ మార్పులు చేపట్టింది. ఈ జాగ్రత్తల వల్లే సెన్సార్ పనులు కొంత ఆలస్యమైనప్పటికీ, తుది కాపీ మాత్రం అద్భుతంగా వచ్చిందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టులో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. కథను మరింత పకడ్బందీగా ముందుకు నడిపించేందుకు వీరి పాత్రలు ఎంతో దోహదపడతాయని సమాచారం. యంగ్ సెన్సేషన్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి అదిరిపోయే